ట్విట్టర్లో జోరుగా ఉండే టీడీపీ నేత నారా లోకేశ్ మొన్న వైఎస్ జగన్ పై ఓ పంచింగ్ ట్వీట్ పోస్టు చేశారు. 46 ఏళ్లకు జగన్ కు ఉద్యోగం వచ్చింది కానీ.. 45 ఏళ్లకే ఫించన్ రత్నం మాత్రం రాలిపోయిందని సెటైర్ వేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు లోకేశ్ వేసిన పంచ్ పై వైసీపీ నేతలు రివర్స్ పంచ్ వేస్తున్నారు. జగన్ కు 46 ఏళ్ల కు ఉద్యోగం సంగతేమో కానీ.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని నారా లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు.


పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల బిల్లు ఆమోదించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాజా చెప్పారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమలో చూసినా, కంపెనీలో చూసినా నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చట్టం చేసి కూడా అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం వద్ద మన హక్కులను తాకట్టు పెట్టారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చి ఉండి ఉంటే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పరుగులు తీసేవారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: