అసెంబ్లీ సమావేశాలను నిసితంగా పరిశీలిస్తున్న వారికి అవుననే అనిపిస్తోంది. లేకపోతే ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారన్న సాకుతో మొత్తం ఎంఎల్ఏలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించటమేంటి ? పైగా అధికారపార్టీ కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెడుతున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించటమంటే అర్ధమేంటి ?

 

గడచిన రెండు రోజుల్లో అసెంబ్లీ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కోటా, నామినేటెడ్ వర్కుల్లో పై వర్గాలకే 50 రిజర్వేషన్, దశలవారీగా మద్య నిషేధం అమలు లాంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టింది.

 

టిడిపి మద్దతున్నా లేకపోయినా పాసయ్యే బిల్లులు ఎలాగూ పాసైపోతాయి. కానీ ఆ బిల్లులపై చర్చలో పాల్గొంటే బిల్లులకు మద్దతు ఇవ్వటమో లేకపోతే వ్యతిరేకించటమో చేయాలి. మద్దతిస్తే వైసిపికి మద్దతిచ్చినట్లే అని చంద్రబాబు అనుకున్నారు. ఇంతకాలం మీరెందుకు ఈపని చేయలేదనే చర్చ మొదలవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి.

 

ఒకవేళ బిల్లులను వ్యతిరేకిస్తే పై వర్గాలకు చంద్రబాబు వ్యతిరేకమనే విషయం స్పష్టమవుతుంది. అసలే మొన్నటి ఎన్నికల ఫలితాలతో టిడిపికి తల బొప్పి కట్టింది. ఇక పై వర్గాలకు టిడిపి వ్యతిరేకమని స్పష్టమైతే భవిష్యత్తులో పార్టీకి పుటగతులుండవు. అందుకే ముగ్గురు ఎంఎల్ఏల సస్పెన్షన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: