ఈ మద్య జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు..ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఫేస్ కనిపించాలి, తాము చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు కనిపించాలి అని తెగ ఆరాటపడుతున్నారు.  వీరి ఆలోచనలుకు తగ్గట్టుగానే ఇప్పుడు టిక్ టాక్ యాప్ రావడంతో ఇంకేముందు సెల్ ఫోన్ తో ఏదో ఒక పేరడీనో, సాంగ్ కి అనుకూలంగా డ్యాన్స్ చేయడం లాంటి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  అయితే కొంత మంది ఓ అడుగు ముందుకు వేసి డేంజరస్ ఫీట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. 

అయితే ఈ టిక్ టాక్ ఏ పనీ పాటా లేని వాళ్లు చేస్తే ఓకే కానీ ఈ మద్య వేలం వెర్రి తో కొంతమంది ఉద్యోగస్తులు..అందులోనూ ఓ బాధ్యత గల హోదాలో ఉన్నవారు సైతం టిక్ టాక్ చేస్తూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మం మున్సిపల్ సిబ్బంది ఆఫీసులో టిక్ టాక్ లుచేసి అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీసు అధికారి పోలీస్ స్టేషన్ లోనే టిక్ టాక్ వీడియో చేసింది... తీరా ఆ వీడియో కారణంగానే ఉద్యోగం పోగొట్టుకుంది.

ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.  గుజరాత్ రాష్ట్రం ముస్తాబై పోలీస్ స్టేషన్ లో అర్పితా అనే ఓ మహిళా పోలీసు అధికారి ఓ బాలీవుడ్ పాటకు టిక్ టాక్ చేసింది. అది కాస్త తన ఫ్రెండ్స్ కి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది ఆఫీసులో కనీసం యూనిఫాం కూడా వేసుకోలేదని ఆమెపై మండిపడ్డారు. అక్కడితో ఆగలేదు ఆమెను విధుల నుంచి కూడా బహిష్కరించారు. ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు సోషల్ మీడీయా వేదికగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: