అను ఇమ్మానియేల్.. ఒర చూపుతోనే అబ్బాయిలను అబ్బా అనిపించే అందం ఉన్నా.. ఈ భామకు మాత్రం ఇటీవల కలసిరావడం లేదు. సినీరంగంలో ఎంత అందం ఉన్నా.. విజయాలే కొలమానం.. ఆ లెక్కన చూస్తే అనూ ఇమ్మానియేల్ కు తెలుగు ఇండస్ట్రీలో టఫ్ టైమ్ నడుస్తోంది.


పెద్దగా అవకాశాలు కూడా లేకపోవడంతో అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నేనూ ఉన్నాను.. కాస్త పట్టించుకోండని హింట్ ఇస్తోంది. తాజాగా ఆమె పోస్టు చేసిన పిక్ మాత్రం అదరగొడుతోంది. పసుపు పచ్చ చీరలో సాంప్రదాయబద్దంగా కనిపిస్తున్న అను ఇమ్మానియేల్.. ఓర చూపుతో ఆకట్టుకుంటోంది.


చీరలోనూ అందాలు ఆరబోయవచ్చని చాటిచెబుతూ.. బ్యాక్ ఓపెన్ బ్లౌజుతో కుర్రాళ్ల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక అను ఇమ్మానియేల్ సినిమాల విషయానికి వస్తే.. పాపం.. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలేమీ కనిపించడం లేదు.


న్యాచురల్ స్టార్ నాని మజ్నుతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందీ మళయాళ భామ. ఆ సినిమా కాస్త యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ అజ్ఞాత వాసితో దక్కినా.. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో అనూని దురదృష్టం వెక్కిరించేసింది.


తక్కువ సమయంలోనే మెగా కాంపాండ్ హీరోయిన్ గా చెప్పుకున్న అను ఇమ్మానియేల్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో మళ్లీ దశతిరగడం ఖాయం అనుకున్నా.. పాపం.. మరోసారి బ్యాడ్ లక్ ఎదురైంది.


ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ, నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్‌లో శైలజారెడ్డి అల్లుడు కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇలా అదరగొడతాయనుకున్న సినిమాలన్నీ వరసపెట్టి తన్నేయడంతో ఇప్పుడు అనూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ మధ్య వచ్చిన విశాల్ సినిమా గూఢచారి పరవాలేదనిపించినా ఆ క్రెడిట్ కాస్తా విశాల్ ఖాతాలోకే వెళ్లింది తప్ప అనూకు ప్లస్ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: