ఈ మద్య టిక్ టాక్ గోల ఎంతగా మొదలైందంటే ఉదయం లేవగానే ఎదో ఒక టిక్ టాక్ మొదలు పెట్టి పడుకునే ముందు కూడా ఎదో ఒక టిక్ టాక్ చేద్దామా అనుకునేంతగా తయారయ్యారు యూత్.  కేవలం యూత్ మాత్రమే కాదు అన్ని వర్గాల వారు ఈ టిక్ టాక్ మాయలో పడిపోతున్నారు. చిన్ని పిల్లల నుంచి వృద్దుల వరకు..నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం తమ విధులను పక్కన బెట్టి టిట్ టాక్ చేయడం ఉద్యోగాలు పోగొట్టుకోవడం కామన్ అయ్యింది.

ఆ మద్య ఖమ్మం కార్పోరేషన్ లో టిక్ టాక్ చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు..ఈ మద్య గాంధీ హాస్పిటల్ అప్రెంటిస్ విద్యార్థులు టిక్ టాక్ చేసి తమ కెరీర్ నాశనం చేసుకున్నారు. గుజరాత్ లో ఒ పోలీస్ స్టేషన్ లాకప్ వద్ద టిక్‌టాక్ చేసిన మహిళా కానిస్టేబుల్ అల్పిత చౌదరిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  అయితే కోడలికి బుద్ది చెప్పి అత్త అదేదో చేసినట్లు ఇప్పుడు అల్పిత చౌదరిని సస్పెండ్ చేసిన  గుజరాత్ డిప్యూటీ ఎస్పీ మంజిత వంజారా టిక్ టాక్  చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 

ఓ పంజాబీ పాటకు స్నేహితురాలితో కలిసి వంజారా హుషారుగా స్టెప్పులేస్తూ కనిపించారు.  వంజారా వీడియోపై నెటిజన్లు ఫైరవుతున్నారు.  అయితే టిక్ టాక్ చేయడం తప్పు అని పెద్ద బిల్డప్ ఇచ్చి పై అధికారుల మన్ననలు పొందుతూ నీ కింది కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి మరి నువ్వ చేసిందేమిటీ అంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. టిక్‌టాక్‌ వీడియో చేసిన ఆమెపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  కాగా, అల్పిత చౌదరి సస్పెన్షన్‌పై డీఎస్పీ వంజారా వివరణ ఇచ్చారు. టిక్‌టాక్ చేసినందుకు ఆమెను సస్పెండ్ చేయలేదని, విధుల్లో ఉండీ యూనిఫాం ధరించనందుకే సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతే కాదు తాను చేసిన టిక్ టాక్ పై కూడా వివరణ ఇచ్చింది. 

ఇప్పుడు చేసిన టిక్ టాక్ కాదని..గత మూడు నెలల క్రితం చేసింది ఎవరో అప్ లోడ్ చేశారని..అయినా తాను విధుల్లో ఉండగా చేసిన టిక్ టాక్ కాదని..అయితే అది తన పర్సనల్ అని  తాను మంచి కూచిపూడి డ్యాన్సర్‌నని, వంట కూడా బాగా చేస్తానని చెప్పుకొచ్చారు. తాను విధుల్లో లేనప్పుడు మాత్రమే ఇటువంటి పనులు చేస్తానని, తన స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని డీఎస్పీ తేల్చి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: