అవసరానికి తగ్గట్టుగా రంగులు మారిస్తే దానిని ఊసరవెల్లి అంటారు. అప్పటి అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంది. అయితే, ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ కూడా రంగులు మారుస్తుండట. ఈ విషయం మీకు తెలుసా.. తాజ్ మహల్ ను ఎవరు నిర్మించారు అన్నది కాదు.. దాని నిర్మాణానికి పనిచేసిన కూలీలు ఎవరు అని తెలుసుకోవాలని అంటారు.

తాజ్ మహల్ నిర్మాణం పూర్తయ్యాక, దానికోసం పనిచేసిన 22 వేల మంది కూలీలను హతమార్చారు. అందుకు ఒకేఒక్క కారణం ఉంది. తాజ్ మహల్ వంటి అద్బుతమైన నిర్మాణం మరొకటి ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఆ పని చేయించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు.

తాజ్ మహల్ నిర్మాణం పూర్తికావడానికి 22 సంవత్సరాలు పట్టిందని చరిత్రను బట్టి తెలుస్తుంది. తాజ్ మహల్ నిర్మాణంలో రాజస్తాన్ నుంచి తీసుకొచ్చిన నాణ్యమైన పాలరాయితో పాటు ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విలువైన రాళ్ళను కూడా ఆ నిర్మాణంలో వినియోగించారు. రాజస్తాన్ నుంచి మార్బుల్స్, పంజాబ్ నుంచి జాస్ఫర్, టిబెట్ నుంచి నీలపురాయి, అఫ్ఘానిస్తాన్ నుంచి లజౌళి, శ్రీలంక నుంచి అమరాల్డ్, చైనా నుంచి కృష్టల్స్ ను తెప్పించి ఈ నిర్మాణంలో వినియోగించరాట.

ఇండియన్, పర్షియన్ సంస్కృతుల సంప్రదాయ మేళవింపులో ఉంటుంది ఈ కట్టడం. 1631 లో ప్రారంభమయిన ఈ కట్టడం 1656 వరకు కొనసాగింది. ప్రపంచంలోనే అత్యాధుతమైన కట్టడంగా పేరుపొందిన తాజ్ మహల్ లోపల చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ మహల్ సమాధులు మాత్రమే ఉంటాయి.

అయితే, ఈ సమాధులు కూడా బయటకు కనిపించవు. ఉపరితలం నుంచి 7 అడుగుల లోతులో ఈ సమాదులు ఉంటాయి. ఇవి బయటకు కనిపించకుండా దానిపై మెటల్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. బయట నుంచి ఈ నిర్మాన్మ ఒక డోమ్ ఆకృతిలో ఉండి చుట్టూ నాలుగు మినార్ లు ఉంటాయి.

ప్రకృతి విపత్తులకు తట్టుకొని నిలబడే విధంగా ఈ తాజ్ మహల్ నిర్మాణం జరిగింది. యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు తాజ్ మహల్ సందర్శనకు అనువైన రోజులు. ఎండాకాలంలో ఆగ్రాలో వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమకు చిహ్నంగా నిర్మించిన తాజ్ మహల్ ఉదయం సమయంలో పింక్ రంగులోనూ, మధ్యాహ్నం సమయంలో తెల్లగాను, సాయంకాలం వేళ బంగారు రంగులోను కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: