గత ప్రభుత్వమైన తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొదలైంది. వైసీపీ సభ్యులు శాసనసభలో ఈ ప్రాజెక్ట్ లో వేల కోట్ల దోపిడి జరిగిందని ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై విచారణ జరిపించి దోషుల నుంచి సొమ్ము రికవరీ చేయించాలని డిమాండ్ చేసారు. ఒక్కో సెట్ టాప్ బాక్స్ 1500 రుపాయలు కూడా విలువ చేయనప్పటికి 4000 రుపాయల చొప్పున వసూలు చేసారని ఆరోపించారు వైసీపీ శాసన సభ సభ్యులు. 
 
తెలుగుదేశం పాలనలో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రుపాయలు దోచుకుందని, కేబుల్ వ్యవస్థ ద్వారా వారు చెప్పిందే చూపించాలనే నియంతృత్వ ధోరణికి తెరలేపారని వైసీపీ శానససభ సభ్యులు అన్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని చెప్పి 1500 రుపాయలు కూడా విలువ చేయని సెట్ టాప్ బాక్స్ కు 4000 రుపాయలు ప్రజలు నుండి వసూలు చేసారని అన్నారు. 
 
జోగి రమేష్ మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అనుచరులకు చెందిన నాలుగు కంపెనీలకు అప్పగించారు. తెలుగుదేశం ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ ఉపయోగించుకుంది. మంత్రి నారా లోకేశ్ ఈ పథకంలోని నిధుల్ని దుర్వినియోగం చేసారు. ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిని బయటపెట్టి, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ముందుకు వెళ్ళాలని అన్నారు. 
 
మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్లో సెట్ టాప్ బాక్సులు ఎక్కువ ధరకు కొనుగోలు చేసారని 1000 వెయ్యి కోట్ల రుపాయల అవినీతి జరిగిందని, ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్ కు చెందిన కంపెనీలకు ఈ ప్రాజెక్టుని చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందని విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: