తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం లో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతి పై వైకాపా సర్కార్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది   . ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి నెట్ , ఫోన్ ,  టీవీ కనెక్షన్ అంటూ చంద్రబాబు సర్కార్ అప్పట్లో  ప్రచారం చేసుకుంది . ఫైబర్ గ్రిడ్ పథకం లో భాగంగా సెట్ ఆప్ బాక్స్ ల కొనుగోలు నుంచి ఎమ్మెస్వో ల ఎంపిక వరకు అన్నింటా అవినినీతి జరిగిందని  ప్రతిపక్షం లో ఉన్నప్పుడు వైకాపా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది . అయినా టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు .


ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైకాపా కు పట్టం కట్టడంతో గత ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు జగన్ సర్కార్ కంకణం కట్టుకుంది . దానిలో భాగంగానే ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు , అమరావతి నిర్మాణం , విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఒక్కటేమిటి అన్నింటిపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది . దానిలో భాగంగానే ఫైబర్ గ్రిడ్ లో చోటు చేసుకున్న అవినీతిపై దృష్టి సారించింది . ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన సెట్ ఆప్ బాక్స్ లు నాసిరకమైన చైనా తయారీవని , అలాగే ఎమ్మెస్వో లుగా పూర్తిగా తెలుగు తమ్ముళ్లను ఎంపిక చేశారని తెలుస్తోంది .


 ఇప్పటికే ఎమ్మెస్వో లు ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నెట్ , ఫోన్ , టీవీ కనెక్షన్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది . ప్రభుత్వం మారడం తో అసలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందో , లేదోనన్న అనుమానం తో ఉన్న ప్రజలు తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఎమ్మెస్వో లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం . దీనితో ఎమ్మెస్వోలు గా తమనే  కొనసాగించాలని ,   మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ని కలిసినట్లు తెలుస్తోంది . అయితే ఈ విషయాన్నీ మంత్రి , ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లడంలో ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ప్రతి పైసా చెల్లించాల్సిందేనని , లేకపోతె క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం


మరింత సమాచారం తెలుసుకోండి: