రాజకీయాల్లో శతృత్వం, మిత్రత్వం శాశ్వతం కాదన్నది జగమెరిగిన సత్యం. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ చతురత కూడా అందుకు అర్థం పట్టబోతున్నట్టు    రాజకీయ పరిశీలకుల అంచనా. రచ్చబండలపైన జరిగే రాజకీయ గోష్టిల ఉహ నిజమయ్యే పరిణామాలు ఆవిషృతమవుతున్నయన్పిస్తుంది.
కాంగ్రెసులోకి రేవంత్ రెడ్డిని పంపినప్పుడు రచ్చబండ రాజకీయం కాంగ్రెస్ తో దోస్తీ కి చంద్రబాబు వ్యుహం అని ముందే చెప్పింది.ఇప్పుడు
 బిజెపితో దోస్తికి సుజనా చౌదరిని కషాయ తీర్థం.

కమలదళంకి  కూడా కావలసింది ఇదే కారణం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పాగ వేయడానికి బిజెపికి తోడు అవసరం అది బలమైన క్యాడర్ ఉన్న తెలుగు దేశం అయితే బాగుంటుందనే వారి ఆలోచన కావచ్చు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో వైసిపికి చెక్ పెట్టలంటే తెలుగుదేశం తమ్ముళ్లతో దోస్తీ అవసరం. సమీప భవిష్యత్తులో బిజెపి టిడిపి కలసి ముందుకు సాగటం తథ్యం రచ్చబండ రాజకీయ చర్చగోష్టి బలంగా వాదిస్తుంది. తాజాగా జరిగిన పరిణామం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్ సందర్భంగా జరిగిన వ్యవహారం అందకు ఊతమిస్తోంది. ఇంతకీ త్రిపుల్ తలాక్ బిల్లులో ఏం జరిగింది ? ఏం జరిగిందంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును  వైసిపి వ్యతిరేకించగా టిడిపి మద్దతు ప్రకటించింది. టిడిపి వైఖరితో భవిష్యత్తులు మారబోయే రాజకీయ సమీకరణలపై సూచనలు స్పష్టంగా కనబడుతోంది.
మొన్నటి ఎన్నికల్లో నరేంద్రమోడిని టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రస్ధాయిలో వ్యతిరేకించారు. 2014లో గెలిచిన తర్వాత నాలుగేళ్ళు కలిసే ఉన్నప్పటికీ చివరి ఏడాదిలో మాత్రం విడిపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండి మోడిని ఎంతగా వ్యతిరేకించాలో అంతగాను వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అయితే కాలికి బలపం కట్టుకుని మరీ బయట రాష్ట్రాల్లో కూడా తిరిగి మోడి వ్యతిరేక ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే...


 కేంద్రంలో మళ్ళీ రెండోసారి మోడినే అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో ముఖ్యమంత్రయ్యారు. దాంతో గోడ దెబ్బ చెంపదెబ్బ లాగ చంద్రబాబుకు మొహం వాచిపోయింది. ఏకకాలంలో అటు మోడి ఇటు జగన్ తో శతృత్వం పెట్టుకుంటే నష్టం తప్పదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. దాంతో మెల్లిగా మోడికి దగ్గరవ్వాలని ప్రయత్నించారు. కానీ మోడి అందుకు ఒప్పుకోలేదు.


దాంతో చేసేది లేక ముందుగా తన బినామీలుగా ప్రచారంలో ఉన్న అత్యంత నమ్మకస్తులైన రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి ఫిరాయించేందుకు అనుమతించారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు చంద్రబాబు బినామీలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు రాజకీయ రక్షణకే వాళ్ళు బిజెపిలోకి వెళ్ళారన్న విషయం ఎవరినడిగినా చెబుతారు.ఇందులో భాగంగానే మొన్న సమాచార హక్కు చట్టం సవరణల బిల్లుకు తాజాగా త్రిపుల్ తలాక్ బిల్లుకు టిడిపి మద్దతు ఇచ్చింది. అంటే ఏదో రూపంలో మోడికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మార్గాలు వెతుక్కుంటున్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: