మొన్నటి ఎన్నికల్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి మంచి సపోర్ట్ అందింది. టీడీపీకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. బాలకృష్ణ ఉన్నా ఎలాగూ తన  సొంత పార్టీనే కాబట్టి సపోర్ట్ అందిందని అనుకోవడానికి వీల్లేదు. వైసీపీకి మాత్రం పృథ్వీ, ఆలీ, పోసాని, మోహన్ బాబు, రాజశేఖర్-జీవిత, రాజా, విజయచందర్, కోనవెంకట్.. లాంటి వాళ్లు తమ పూర్తి సపోర్ట్ చేశారు. సినిమా ఆకర్షణ కూడా వైసీపీకి లాభించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అవడమూ జరిగిపోయింది.

 

అయితే నమ్మిన వాళ్లను అక్కున చేర్చుకుంటాడనే పేరున్న జగన్ తనను సపోర్ట్ చేసిన సినిమా వాళ్లకు ఒకొక్కరిగా పదవులు కట్టబెడుతున్నారు. పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆలీకి ఏపీఎఫ్ డీసీ పదవి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలింది మోహన్ బాబు, రాజశేఖర్. వీళ్లకి ఏం పదవులు కట్టబెడతారో చూడాల్సిందే. ఇకపోతే జగన్ తరపున ఎక్కవగా ప్రచారం చేసి సినీపరిశ్రమ నుంచి ఆయనకు కవచంలా నిలబడిన వ్యక్తుల్లో ప్రముఖుడు పోసాని కృష్ణమురళి. ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి మరీ జగన్ కు సపోర్ట్ చేసేవాడు. పోసానికి ప్రభుత్వంలో పదవి అంటూ ఎక్కడా వార్తలు రాకపోయినా పృథ్వీ మాటల్లో మాత్రం పోసానికి జగన్ కేబినెట్ పదవి ఆఫర్ చేస్తారేమో అని ఓ ప్రెస్ మీట్ లో అన్నాడు.

 

నిప్పు లేకుండా పొగ రాదనే సామెతలా ప్రభుత్వానికి దగ్గరైన వ్యక్తే ఇలా ఓ హింట్ ఇచ్చాడంటే మరి పోసానికి జగన్ ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టే లెక్క. ఇటివల జగన్ విషయంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలను పోసాని ఖండించాడు. దీనిపై పృథ్వీ స్పందిస్తూ పోసాని తనకు అన్న స్థాయి వ్యక్తి అని వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలకు డాట్ పెట్టేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: