ఆమె రాజకీయం అంతా డేరింగ్ అండ్ డేషింగ్. ఆమెను చూసి బీజేపీ కురు వ్రుధ్ధులు వాజ్ పేయ్, అద్వాని లాంటి వారు ఎంతో ముచ్చటపడిపోయేవారు. ఆమె డైనమిక్ నేచర్, ఆమె వాగ్దాటి, ఆమెకు ఉన్న సబ్జెక్ట్, భాష మీద పట్టు, సమయ స్పూర్తి ఇవన్నీ గొప్ప నాయకురాలిగా తయారుచేశాయి. పువ్వు పుట్టగనే పరిమళించినట్లుగా సుష్మా స్వరాజ్ విద్యార్ధి దశ నుంచే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. కేవలం పాతికేళ్ళ వయసులోనే ఆమె హర్యానా క్యాబినేట్లో మంత్రి అయి కొత్త రికార్డ్ స్రుష్టినారు. బహుశా ఇప్పటికీ ఆ రికార్డ్ ని మహిళలలో ఎవరూ బద్దలుకొట్టలేదేమో

సుష్మా స్వరాజ్ హఠాత్తుగా అందరినీ వదిలి వెళ్ళడం బాధాకరం. ఆమె బీజేపీలో ఓ దిగ్గజ స్థాయి నాయకురాలు. ఆమెకున్న అనుభవం, ఆమె స్టేచర్ తీసుకుంటే ఎపుడో ఈ దేశానికి ప్రధాని కావాల్సిన వారు. ఆమె మహిళా సాధికారికతను మారు పేరు. ఆమె ఎందరికో స్పూర్తిదాయకం. బీజేపీలో ప్రధాని అర్హత కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారంతా పురుషులు. మహిళలలో మాత్రం వినిపించే ఒకే ఒక్క పేరు సుష్మా స్వరాజ్. ఆమె అరోగ్యంగా ఉంటే ఆ అవకాశం ఎపుడో ఒకపుడు వచ్చి ఉండేదేమో కూడా.


బ్యాడ్ లక్ ఆమె మూడేళ్ళ క్రితం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. నాటి నుంచి కొంత చురుకుదనం తగ్గింది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ కూడా చేయలేదు. ఏడుసార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుష్మాఢిల్లీ  సీఎంగా కూడా పనిచేశారు. వాజ్ పేయ్, మోడీ క్యాబినేట్లో కేంద్ర మంత్రిగా సత్తా చాటారు. పార్టీ అదేశానుసారం ఆమె ఎటువంటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండేవారు. ఆమె అందులో వెనకడుగు వేసేవారు కాదు.


సుష్మా స్వరాజ్ ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేసేవారు. ఆమె నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లో ఆమె పనితనం కనిపిస్తుంది. విదేశాంగ శాఖ నిర్వహించిన ఏకైక మహిళగా మరో రికార్డ్ కూడా సుష్మా సొంతం. బీజేపీలో చాల మంది కన్నా వయసులో ఆమె చిన్న. కానీ సీనియారిటీలో మిన్న.  అయినా ఎపుడూ ఆమె అహంభావం చూపించలేదు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చారు. పార్టీలో సుష్మ అందరికీ కావాల్సిన వారు అనిపించుకున్నారు.


నిజంగా సుష్మ స్వరాజ్ వయసు కూడా తక్కువే. ఆమె మరిన్ని దశాబ్దాలు ఈ దేశానికి సేవ చేయాల్సిన వారు. ఓ విధంగా మరో సారి మహిళ ఈ దేశానికి ప్రధానిగా రావాలంటే అది సుష్మాయేనని అంతా భావించారు. అటువంటి ఆమె చిన్న వయసులోనే అన్నీ సాధించి చిన్న వయసులోనే కన్ను మూయడం బాధకరం. భారతీయతకు నిలువెత్తు రూపంగా పెద్ద బొట్టుతో, చీరకట్టుతో కనిపించే సుష్మా అచ్చమైన భారతమాత ముద్దు బిడ్డ.


మరింత సమాచారం తెలుసుకోండి: