ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన ఉన్నతాధికారులను తీసుకువచ్చే విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర విషయంలో వెల్లడైంది. ఈ క్రమంలో తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిని  తెచ్చుకునేందుకు రాష్ట్ర  నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్  ఈ అధికారుల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం. జగన్ విజ్ఞప్తిని ప్రధాని మన్నించారని ప్రచారం జరుగుతోంది.ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై పార్లమెంట్‌లో బిజీగా ఉన్నప్పటికి ప్రధాని నరేంద్రమోడీ 'జగన్‌'కు 45 నిమిషాలు పాటు సమయాన్ని కేటాయించారు. ఈ పరిణామం  వైఎస్సార్ సీపీ శ్రేణులు చెపుతున్న దానికి ఊతమిస్తుంది. 


ఇప్పటికే  తెలంగాణ క్యాడర్‌లో పనిచేస్తోన్న ఆ ఐఎఎస్‌ ని ఆంధ్రాకు కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కోరడం, దానికి ఆయన అంగీకరించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు రెండు నెలల నుంచి ఆమె కోసం వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు 'విజయసాయిరెడ్డి' ఢిల్లీలో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగనే నేరుగా 'శ్రీలక్ష్మి'ని తీసుకుని ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షాల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తులు ఫలించినట్లు కనిపించడం లేదని మరో వాదన వినవస్తుంది.


ఎటువంటి కారణం లేకుండా ఐఎఎస్‌ అధికారులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించడానికి కేంద్రం సిద్ధంగా లేదు. అయితే బిజెపితో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్న వైకాపా 'శ్రీలక్ష్మి' కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పి.వి. రమేష్' రిటైర్‌ కావడంతో..ఆయన స్థానంలో 'శ్రీలక్ష్మి'ని తీసుకోవాలని 'జగన్‌' నిర్ణయించారు. అయితే ఆయన విజ్ఞప్తిని ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదిస్తుందా..? లేక తిరస్కరిస్తుందా..? అనేది త్వరలో తేలనుంది. నిజా నిజాలు మరి కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: