ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన విషయంలో మోడీ ప్రభుత్వం డేరింగ్ డెసిషన్ తీసుకోవడంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తున్నది.  ఇండియా తీసుకున్న ఈ డెసిషన్ ను స్వాగతిస్తున్నాయి.  ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో సామాన్య పరిస్థితులు వస్తున్నాయి.  ప్రజలు కూడా అర్ధం చేసుకుంటున్నారు.  జమ్మూలో ఇప్పటికే దుకాణాలు తెరుచుకున్నాయి.  మరో రెండు మూడు రోజుల్లో అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో నార్మల్ గా మారతాయని తెలుస్తోంది.  కాశ్మీర్లోను, ఇతర ప్రాంతాల్లో త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. 



ఇదిలా ఉంటె, ఇండియా తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ ను పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది.  ఇకపై ఇండియాతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది.  ఈ విషయంపై ఐక్యరాజ్య సమితిలో కంప్లైన్ట్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  కాశ్మీర్ ప్రజల స్వాతంత్య్రాన్ని ఇండియా లాగేసుకుంటోందని గగ్గోలు పెడుతున్నది.  దీంతో పాటు, పాక్ లోని భారత రాయబారిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.  



జమ్మూ అండ్ కాశ్మీర్ లో నార్మల్ పరిస్థితులు వస్తుండటంలో సపరేటిస్ట్ పార్టీలకు నచ్చడం లేదు. ఎలాగైనా ఈ పరిస్థితులను చెడగొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటె, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నది.  పాకిస్తాన్ వ్యతిరేకించినా.. పాక్ లో ఉన్న ప్రజలు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు.  మోడీ తీసుకున్న డేరింగ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.  అఖండ భారతావని కోసం మోడీ కృషి చేయాలనీ, మోడీ ఆధ్వర్యంలోనే ఇది సాధ్యం అవుతుందని ఇస్లామాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. 


ఇస్లామాబాద్ లోని ప్రెస్ క్లబ్,  సెక్టార్ 6, అబ్ పారా చౌక్ ప్రాంతంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.  ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ తో కూడిన అఖండ భారతదేశం మోడీ ఆధ్వర్యంలో సాధ్యం అవుతుందని చెప్పి ఫ్లెక్సీలో ఉన్నది.  ఈ ఫ్లెక్సీని పెట్టిన చాలా సేపటివరకు పాక్ అధికారులు చూడలేదు.  చివరికి అక్కడి ప్రజలు కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దానిని తొలగించారు.  ఈ ఫ్లెక్సీలు వెలవడంతో పాక్ లో గందరగోళం నెలకొన్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: