అనంతపురం జిల్లా కియా కార్ల పరిశ్రమ నుంచి కార్ల ఉత్పత్తి మొదలైంది. పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా పరిశ్రమలో తయారైన తొలి కారు మార్కెట్లోకి వచ్చింది. ఈ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమం చాలా సింపుల్ గా జరిగిపోయింది.


ఈ కార్యక్రమానికి మీడియాను కూడా రానివ్వలేదట. వరల్డ్‌ క్లాస్‌ టెక్నాలజీతో సెల్టాస్‌ మోడల్‌ తయారుచేసినట్ల కియా ప్రతినిధి భట్ తెలిపారు. ఏడాదిలో 3 లక్షల కార్లు తయారు చేస్తామన్నారు. మూడు వారాల్లో 25 వేల కార్లు బుకింగ్ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రసంగించిన మంత్రి బుగ్గన.. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రోజా చెప్పారు.


అయితే ఈ కార్యక్రమం జరిగిన తీరు.. దాన్ని తెలుగు మీడియా పట్టించుకున్న తీరు చూస్తే పాతరోజులు గుర్తుకు రాకమానవు. కియా పరిశ్రమకు భూమి కేటాయింపు దగ్గరనుంచి.. ఆ పరిశ్రమ ప్రారంభం వరకూ తెలుగుదేశం సర్కారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..చివరకు అక్కడ ఒక్క కారు తయారు కాకపోయినా.. తొలి మోడల్ విడుదల అంటూ నానా హడావిడి చేశారు. అప్పడు తెలుగు మీడియా అంతా లైవ్ కార్యక్రమాలతో ఊదరగొట్టింది.


ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు.. అదే కార్ల కంపెనీ.. అసలైన ఉత్పత్తి మొదలైన కార్యక్రమం.. అయినా పెద్దగా హడావిడేమీ లేదు.. ఉదయం నుంచీ టీవీల్లో లైవ్ కార్యక్రమాలు లేవు.. సీఎం జగన్ అందుబాటులో ఉన్నా... వరద బాధితుల పరామర్శకే ప్రయారిటీ ఇచ్చాడు. కార్యక్రమం సింపుల్ గా జరిగిపోయింది. ఈ విషయమంతా గమనించిన జర్నలిస్టులు అదే చంద్రబాబు ఉంటే.. ఎంత రచ్చరచ్చగా ఉండేదో అని గుర్తు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: