ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశంలో బీజేపీకి క్రేజ్ పెరిగింది.  హామీ ఇస్తే దాన్ని ఎలాగైనా అమలు చేయగలదు అని ఒక ముద్రపడింది.  మోడీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.  బీజేపీ రోజు రోజుకు బలపడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం రోజు రోజుకు బలహీనపడుతుంది.  ఇందుకు రాజ్యసభ, లోక్ సభలో ఆర్టికల్ 370 విషయంలో ఆ పార్టీ అనుసరించిన తీరు ఒక ఉదాహరణ.  ప్రతిపక్షాలలో చాలా పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపాయి.  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యతిరేకించింది. 



కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులకు ఈ నిర్ణయం సరైనదిగా అనిపించినా.. బయటకు చెప్పలేకపోయారు.  దేశంలో బీజేపీ బలపడుతుండటంతో తెలంగాణా బీజేపీ ఆనందాన్ని వ్యక్తం చేసింది.  త్వరలోనే తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన ప్రభావాన్ని  ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటికే తెలుగుదేశంపార్టీ కనుమరుగైంది.  కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్నది.  



కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చాలామంది బీజేపీవైపు చూస్తున్నారు.  బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు.  తెలంగాణాలో వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తోంది.  ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నది.  ఇదిలా ఉంటె, సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి.  కానీ, ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదు.  



కారణం ముస్లిం ఓట్లు... ఎంఐఎం పార్టీ.  తెలంగాణా విమోచన దినోత్సవం అంటే.. నవాబుల నుంచి హైద్రాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడం.  ఇలా చేయడం ముస్లింలకు ఇష్టం లేదు.  కానీ తప్పలేదు.  తెలంగాణ విమోచనం రోజున గోల్కొండలో జాతీయ జెండా ఎవరేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు.  బీజేపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే.. గోల్కొండలో తెలంగాణ విమోచనం రోజున జాతీయ జెండా ఎగరేస్తామని చెప్పి హింట్ ఇచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: