తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ను కొందరు వరదబాధితులు  వాయించేశారు. కాఫర్ డ్యాం నిర్మాణం వల్లే తమకు ఈ గతి పట్టిందని గట్టిగా నిలదీయటంతో  తప్పంతా ప్రభుత్వానిదే అన్నట్లుగా మాట్లాడేసి అక్కడి నుండి బయటపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరిగా సహాయ చర్యలను చేయటం లేదంటూ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తుపాను ప్రభావాన్ని ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ రెచ్చగొట్టారు.

 

అసలు ఏం జరిగిందంటే తుపాను బాధితులను పరామర్శించటం, బాధితులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పటమనే అజెండాతో  తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం ముంపు ప్రాంతాల్లో  లోకేష్  తిరిగారు. కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు తదితర నేతలను వెంటేసుకుని బోట్లలో తిరుగుతూ వరదబాధితులను కలిసి మాట్లాడారు.

 

వరద ప్రాంతాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో  తిరుగుతూ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ చేస్తున్న సాయంపై వాకాబు చేశారు. ఇంతలో కొందరు మహిళలు లోకేష్ ను నిలదీశారు. కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల ఇపుడు తాము వరదముంపుకు గురైనట్లు మండిపడ్డారు. లోకేష్ బదులిస్తు కాఫర్ డ్యాం అవసరం కాబట్టే నిర్మించామని సర్దిచెప్పుకున్నారు.

 

అయినా మహిళలు వదలకుండా తమకు ముందుగానే పునరావసం కల్పించుంటే తాము ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేవారమన్నారు. ముందుగా తమకు పునరావసం కల్పించకుండా కాఫర్ డ్యాం ఎలా కడతారంటూ నిలదీయటంతో ఏం సమాధానం చెప్పాలో లోకేష్ కు అర్ధం కాలేదు. వెంటనే తుపాను సమస్యలకు ప్రభుత్వందే బాధ్యత అన్నట్లుగా మాట్లాడారు.

 

తుపాను వస్తుందని ముందే హెచ్చరించినా సహాయ చర్యలు చేయటంలోను, పునరావాసం కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ అడ్డుగోలు ఆరోపణలు చేసి అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు. విషయం తెలియకుండా జరిగే ప్రతి నష్టానికి ప్రభుత్వానికి ముడేసి మాట్లాడాలన్న లోకేష్ అత్యుత్సాహంపై మహిళలు నీళ్ళు జల్లటమే కాకుండా ఇప్పటి సమస్యలకు టిడిపి ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చేయటంతో లోకేష్ నోరు మూతపడిపోయింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: