రేషన్ బియ్యం, కంట్రోలు బియ్యం, చౌక బియ్యం.. ఆంధ్రప్రదేశ్ లో సర్కారు ఇచ్చే చౌకధరల బియ్యానికి ఉన్న పేర్లు ఇవి.. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఇవి కేజీ ఒక్క రూపాయికే ఇస్తారు..అయితే ఈ బియ్యం నాణ్యత ఏమాత్రం బావుండదు.. చాలామంది వాటిని తినరు.


చాలా మంది ఈ రేషన్ బియ్యం ఏం చేస్తారో తెలుసా... కొంత మంది పేదలకు అమ్ముకుంటారు. మరికొందరు దోసెలు పోసుకుంటారు.. ఇంకొందరు... కోళ్లు, పశువుల దాణా తయారీకి ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటిలో నాణ్యత ఆ రేంజ్ లో ఉంటుంది. ఎలాగూ కిలో రూపాయకే బియ్యం వస్తున్నప్పుడు.. జనం కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఆ బియ్యం వాడుకుంటున్నారు.


కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారబోతోంది. గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40శాతం బియ్యం తినడానికే వీలు లేకుండా ఉంటున్నాయంటున్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. అందుకే జగన్ సర్కారు పేదవాడు కూడా కడపునిండా నాణ్యమైన సన్నబియ్యంతో తినేందుకు అవకాశం కల్పిస్తున్నారు.


సెప్టెంబర్‌ 1నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభించబోతున్నారట. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రం మొత్తం పంపణీ చేస్తారట. ఐతే.. ఇప్పటి వరకూ రేషన్ బియ్యం వినియోగదాలు సొంత వాహనాలుపై వాటిని ఇళ్లకు తీసుకెళ్లేవాళ్లు.. ఇందుకు వృద్ధులు వికలాంగులు ఇబ్బందిపడేవారు. అందుకే ఇక వాటిని సర్కారు గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్బిదారుల ఇళ్లకే తీసుకెళ్లి అందిస్తుంది.


అంతే కాదు.. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకు ఈ బియ్యాన్ని చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తారట. ఆ ప్యాకింగ్ పై జగన్ బొమ్మ, రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉంటుందన్న సంగతి తెలిసిందే. రూ.12వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి అంటున్నారు మంత్రి కొడాలి నాని.. అంతే కదా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: