ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక ప్రయోగాలు చోటు చేసుకుంటున్నాయి.  మనిషి భూమి,ఆకాశం,v సముద్రం అన్నింటా తన ఆది పత్యాన్ని కొనసాగిస్తున్నారు.  ఆకాశంలో చందమామపై కాలు మోపి అక్కడ విశేషాలు సైతం తెలుసుకుంటున్న పరిజ్ఞానాన్ని సంపాదించారు.  అయితే ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడుతూ భారత దేశంలో సైతం గొప్ప గొప్ప పరిశోధకులు ఉన్నారని నిరూపిస్తు..ఇతర దేశాలకు సైతం తమ సాంకేతిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. 

ఇక దేశం గర్వించదగ్గ ప్రయోగం చంద్రయాన్ 2.  జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. దాంతో జాబిల్లమ్మపై మన రాకెట్ వెళ్తుందని..ఎంతో సంతోషంతో చూడటానికి వచ్చిన వారు..టీవీలో చూస్తున్న వీక్షకులు అంతా నిరాశ పడ్డారు.  ఆ తర్వాత ఈ ప్రయోగాన్ని తిరిగి జూలై 22వ తేదీ సోమవారం చేపడతామని మరొక ట్వీట్‌లో పేర్కొనడం..అనుకున్న సమయానికి చంద్రయాన్ 2 నింగిలోకి దూసుకు వెళ్లడం జరిగింది.  చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష వాహనం చంద్రయాన్.

చంద్రయాన్-2 విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే చంద్రుడిపై చంద్రయాన్ ఎలా ల్యాండ్ అవుతుంది..అది చూడాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. అయితే మీ కల సాకారమయ్యే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇస్రో కార్యాలయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కలిసి చంద్రయాన్‌-2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంతమంది విద్యార్థులకు దక్కనుంది. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ‘ఇస్రో మై గవ్‌’ ఆన్‌లైన్‌ ప్రతిభాపాటవ పోటీలను నిర్వహిస్తోంది.

ఈనెల 10 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థనలు పంపుకోవాలి.  8 నుంచి 10 వ తరగతి చదువుతున్నవారు మొదట గూగుల్ లో ఖాతా ఓపెన్ చేసి.. తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఆన్ లైన్ లో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇంటర్ నెట్ అనుసంధానం చేసుకొని ‘ఇస్రో మై గవ్‌’ అని ఇంగ్లీష్ లో అడ్రస్ నమోదు చేయాలి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయడంతో నిబంధనలు తెలిసిపోతాయి. ఈ పరీక్ష నేడు 12.01 గంటల నుంచి ఆగస్టు 20 11.59 నిమిషాల వరకు ఆన్ లైన్ లో నమోదు సమాధానాలు ఇవ్వడం ప్రారంభం అవుతుంది. పది నిమిషాల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

ఒక్కసారి పోటీ ప్రారంభం అయితే పక్కకు తప్పుకోవడానికి వీలు ఉండదు..సమాధానం రాకుంటే వేరే దానికి సిద్దం కావాలి. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో అత్యధిక సరైన సమాధానాలు రాసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు.  ఈనెల 10 నుంచి 20 వరకు జరిగే ఈ పోటీలో గెలుపొందిన  విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్‌ చంద్రుడి మీదకు దిగే అపురూపమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్ఛు పోటీ ముగిశాక విజేతల వివరాలు వెల్లడిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: