ఇప్పుడు ఏ అంశం అయినా....ఏ సంభాష‌ణ అయినా...క‌శ్మీర్ చుట్టూ తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్టిక‌ల్ 370, ఆర్టిక‌ల్ 35ఏ ర‌ద్దుతో కేంద్ంర కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌ధానంగా కాశ్మీరీ మహిళ భారతదేశంలోని ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళక కశ్మీరీ పౌరసత్వం కోల్పోయేది. కానీ ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీరి మహిళ ఆ పౌరసత్వాన్ని కోల్పోదు. ఈ నేప‌థ్యంలో...హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


జమ్మూకశ్మీర్‌లో ఎవరు శాశ్వత నివాసితులో తేల్చేందుకు తీసుకొచ్చిన ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేయ‌డంలో కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు మార్గం సుగమమైందని ఖట్టర్‌ అన్నారు. `బీహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని మా కేబినెట్‌ మంత్రులు అంటుండేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇకపై కశ్మీర్‌ నుంచి కోడళ్లను తెచ్చుకోవచ్చు. ఆర్డికల్‌ 35ఏ రద్దుతో ఇది సాధ్యమైందని అన్నారు` అంటూ హర్యానా సీఎం తెలిపారు. కశ్మీర్‌ అమ్మాయిలను కోడళ్లు, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారని మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం..అందులోనూ అమ్మాయిల అందం గురించి మంత్రుల సంభాష‌ణ‌ను ప్ర‌స్తావించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


కాగా, మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్టార్ ప‌లు సంద‌ర్భాల్లో వివాదాస్ప‌ద రీతిలో వ్య‌వ‌హ‌రించారు. ఓ కార్యక్రమానికి సీఎం ఖట్టర్ వచ్చిన స‌మ‌యంలో అక్కడున్న ఓ యువకుడు సీఎం పాదాలను తాకి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన సీఎం ఆ యువకుడిని అడ్డుకుని చేయిపై బాదాడు. అనంతరం ముందుకు వెళ్లిపోయారు సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌. ఈయన సహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. 2018 ఫిబ్రవరి నెలలో ఇద్దరు దంపతులు తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించేందుకు సీఎం వద్దకు వచ్చిన సమయంలో ఆయన చిరాకు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: