కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది అంటే.. అద్వాన్నస్థితిలో ఉందని చెప్పాలి. 2014 ఎన్నికల తరువాత దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అని ఎవరూ అనుకోలేదు.  వస్తే సంకీర్ణ ప్రభుత్వం రావొచ్చని లేదంటే యూపీఏ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని అంతా అనుకున్నారు.  



అయితే, అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి.  ఎవరూ ఊహించనట్టుగా బీజేపీని ప్రజలు గెలిపించారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు.  దీంతో రెండు సభల్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది.  ఇది ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది.  దీనిని ఉపయోగించుకొని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది బీజేపీ.  ఇందులో భాగంగానే త్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజనను చేసింది.  



దీంతో దేశంలో బీజేపీ పార్టీకి పలుకుబడి మరింతగా పెరిగింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా ఇప్పటికే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  వీరితో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు.  వీరితో పాటు ఇంకా కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు.  ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోని సభ్యులను కాపాడుకోవడానికి పార్టీ అనేక ఇబ్బందులు పడుతున్నది. 


పార్టీని కాపాడుకోలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.  రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. కేంద్రంలోని కాంగ్రెస్ ఇవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.  రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.  ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడాలి అంటే సెంట్రల్ లో పార్టీకి బలమైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలి.  అప్పుడే కొంతకాలానికైనా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: