ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయిన తర్వాత తొలిసారి విజయవాడలో ఓ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జగన్ ప్రసంగిస్తూ... ఏపీ రాష్ట్రానికి ఉన్న బలహీనతలు, బలాలను ప్రస్తావించారు. దాదాపు 50 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిన సదస్సులో జగన్ ఏపీ ఇబ్బందులను ప్రస్తావించారు.


ఈ తీరును ఇప్పుడు తెలుగుదేశం తప్పుబడుతోంది. జగన్ డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన ప్రసంగంలో రాష్ట్రం పేద రాష్ట్రం అని చెప్పారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎవరైనా మన బలాల గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షిస్తారని, తెలుగుదేశం మీద కోపంతో, రాష్ట్రం సాధించిన ప్రగతి చెప్పుకోక పోతే, పెట్టుబడులు రావని చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ గత మూడేళ్ళ కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదటి స్థానంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సూచిలో దేశంలోనే 2వ స్థానంలో ఉందని గర్వంగా చెప్పాలని తెలుగుదేశం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డీ ఐ కియా వచ్చిందని, పట్టిసీమ ద్వారా రెండు నదులను కలుపుతూ నీతి కొరత లేకుండా చేసామనే విషయాలు వారికి గర్వంగా చెప్పాలని తెలుగుదేశం భావిస్తోంది.


అంతేకాదు.. వ్యవసాయ వృద్ధి రేటులో మొదటి స్థానంలో ఉన్నామని, ప్రకృతి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచిందని, విద్యుత్ సంస్కరణలో, సాంప్రదాయక ఇంధన వనరులులో అగ్రగామిగా ఉన్నామని సగర్వంగా చెప్పాలని తెలుగుదేశం అంటోంది. రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో మొదటి 10 నగరాల్లో మూడు నగరాలకు స్థానం లభించిందని, రెండంకెల వృద్ధి సాధించిందని, భారత దేశంలో తయారయ్యే 5 ఫోన్ లలో 3 ఫోన్ లు ఏపీలో తయారవుతాయనిగర్వంగా చెప్పాలని కూడా తెలుగుదేశం నేతలు అంటున్నారు.


ఏపీలో అపారమైన నైపుణ్య మానవ వనరులు ఉన్న యువత ఉన్నారనే విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ చెప్పిందని, గత 5 ఏళ్ళలో 700 కేంద్ర అవార్డులు గెలుచుకుందని, ఇలా మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయని జగన్ కు సూచించారు. ఇలాంటివి చెప్తే నాలుగు కంపెనీలు వచ్చి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఇవన్నీ మేము సాధించినవని, మీరు చెప్పకుండా, మేము ఇన్ని సీట్లు గెలిచాం, అన్ని సీట్లు గెలిచాం అంటే పెట్టుబడులు రావని లోకేష్ అంటున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. రాష్ట్రానికే వచ్చే పరిశ్రమల వాళ్లు అన్నీ బేరీజు వేసుకున్నాకే బరిలో దిగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: