గోపాలమిత్రలు తదితర ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులను తీసివేయడం అన్యాయమని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. విజయవాడ నగరంలో ధర్నాచౌక్ వద్ద నాలుగు రోజులుగా నిరసన చేస్తున్న గోపాలమిత్రలకు ఆయన సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ.. రైతులకు గ్రామాల్లో అనుబంధంగా ఉంటూ పశుపోషణ, పాడిపరిశ్రమ అభివృద్ధికి గోపాలమిత్రలు మెరుగైన సేవలు అందించారని చెప్పారు. అలాంటిది ఇప్పటి ప్రభుత్వం వారి విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో బాధపడుతుంటారని అన్నారు. 

అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ద్వారా వివిధ శాఖల్లో 15_20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ప్రభుత్వం తీసివేయడం దారుణమన్నారు. కొత్తగా 4 లక్షల ఉద్యోగాలిస్తున్నమని చెప్పుకొంటూ, గత 20 సంవత్సరాలుగా చేస్తున్న  వేలాది మంది ఉద్యోగులను  తీసివేసి వేయడం దుర్మార్గపు చర్య అన్నారు.  కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత వారి సేవలు పరిగణలోకి తీసుకోపోవడం ఎంత వరకు న్యాయం అని అన్నారు.  ఒకరికి అన్యాయం చేసి మరొకరికి న్యాయం చేయడం వల్ల ప్రభుత్వం సాధించేది ఏమిటని ప్రశ్నించారు. 


నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు చెందిన చిరు ఉద్యోగులను అర్ధాంతరంగా రోడ్డున పడేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు.  అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పక్షాన తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుందని, వారితో కలిసి పోరాటం చేస్తామని  రాజేంద్రప్రసాద్  అన్నారు.  ఇలాంటి నిర్ణయాల వల్ల  కొత్తగా నిరుద్యోగులు పుట్టుకొస్తారని ఉన్న ఉద్యోగాలు తీసివేసి నిరుద్యొగులను చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లుబాటవుంతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గోపాలమిత్రల  సంఘం రాష్ట్ర నాయకులు వీరభద్రయ్య, ప్రసాదరావు, మల్లయ్య, వీరాంజనేయులు, గణపతిరావు, కృష్ణా గుంటూరు జిల్లాల గోపాల మిత్ర ఉద్యోగులు, వల్లూరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: