సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితి దారుణంగా తయారైంది. మొత్తం 175 స్థానాలకు కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలచుకుంది. ఎంపీ స్థానాలైతే మరీ దారుణంగా కేవలం మూడంటే మూడే గెలుచుకుంది. ఎన్నికల్లో పరాజయం ఓవైపు బాధ పెడుతుంటే.. పార్టీ నుంచి వరుసగా నేతలు వెళ్లిపోవడం మరోవైపు నుంచి బాధిస్తోంది చంద్రబాబును.


చంద్రబాబుకు అత్యంత ఆప్తులు, ఆర్థిక స్నేహితులుగా పేరున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారు కూడా చివరకు చెప్పాపెట్టకుండా బీజేపీలోకి చేరుకోవడం చూశాం. ఇక ఆ తర్వాత వలసలు జోరందుకుంటాయని టాక్ వచ్చింది. కాపు నేతలంతా కట్టకట్టుకుని బీజేపీలోచేరిపోతున్నారన్న టాక్ కూడా బాగా వచ్చింది. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిన వేళ వలసలు జోరందుకున్నాయి. ఒక దశలో చంద్రబాబు తిరిగి వచ్చేసరికి తెలుగు దేశం ఖాళీ అవుతుందా అన్న సందేహాలు కూడా వెలువడ్డాయి.


అయితే అనూహ్యంగా.. ఆ తర్వాత టీడీపీ నుంచి వలసలు ఆగిపోయాయి. పెద్దగా నేతలు వలస వెళ్లలేదు. కొన్నిరోజులాగా టీడీపీ నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ వలసలు లేవు. దీంతో చంద్రబాబు కాస్త ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న సీఎం రమేశ్ మరో బాంబు పేల్చారు.


టీడీపీ నుంచి తనతో చాలామంది టచ్ లో ఉన్నారని త్వరలో మరికొంతమంది తమ పార్టీలో చేరనున్నారని సీఎం రమేశ్ చెప్పారు. రమేశ్ బీజేపీలో చేరినదగ్గర నుంచి ఆ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నాడు.. తామ పార్టీ మారడంలో చంద్రబాబు హస్తముందన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. చంద్రబాబే మమ్మల్ని బీజేపీలోకి పంపించారని గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలను రమేష్ తప్పుపట్టారు. ప్రచారం చేసే వారు అందుకు తగిన ఆధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఎందుకు బీజేపీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తారని సీఎం రమేశ్ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: