ఢిల్లీ తరహాలోనే జమ్మూకశ్మీర్ లో పాలన ఉండబోతోంది. పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం ఇకపై జమ్మూలో అమలవుతుంది. రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల నడుమ అమిత్ షా కీలక సవరణలు ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370, 35-A రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ ని రెండు ముక్కలు చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ ని విభజించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆర్టికల్ ‌370 రద్దు చేయడం, రాష్ట్రపతి వెనువెంటనే ఆమోద ముద్ర వేయడం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు వెలువెత్తిన సంగతి విధితమే. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ని  అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు.



అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ని చేశారు. శరవేగంగా జరిగిపోయిన చరిత్రాత్మకమైన మార్పులతో జమ్మూకశ్మీర్‌ లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలకంగా వ్యవహరించనున్నారు. ఇందుకు ఎవరిని నియమిస్తారనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తొలుత అందుకు తెలంగాణ గవర్నర్‌  నరసింహన్‌ పేరు తెరపైకి వచ్చింది. జమ్మూ  లెఫ్టినెంట్‌ గవర్నర్ గా ఈయనను నియమించే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈవిషయమై సోషల్ మీడియా హోరెత్తించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరొక పేరు తెరపైకి వచ్చింది. విశ్రాంతి ఐపీఎస్‌ విజయ్‌ కుమార్‌ను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. 



విజయ్ కుమార్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్‌కు చరమగీతం పాడిన వ్యక్తి. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి భవన్ చేరుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్ 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఐపీఎస్ అధికారిగా అనేక కష్టసాధ్యమైన టాస్క్ లను పూర్తి చేశారు. పైగా చెన్నైలో నేరాల రేటును తనదైన పద్ధతిలో తగ్గించిన ఘనత కూడా విజయ్ కుమార్ సొంతం. ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ అయితే జమ్మూకశ్మీర్ పరిస్థితులను నియంత్రణలో ఉంచుతాడని కేంద్రం భావిస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: