నుస్రాత్ జహాన్ రుహీ జైన్ ..  బెంగాలీ నటి కం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. చాలా చిన్న వ‌య‌స్సులోనే బెంగాల్‌లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేయ‌డంతో పాటు త‌న భాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నుస్రాత్ జ‌హాన్ ఇప్పుడు బెంగాల్‌లో సెన్షేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయింది. ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ, ఎంపీగా గెల‌వ‌డం, ఆ త‌ర్వాత ల‌వ్ మ్యారేజ్ అన్నీ ఓ హాట్ టాపిక్‌గానే మారిపోయాయి. ఇక నుస్ర‌త్ స్వ‌త‌హాగా టాప్ మోడ‌ల్‌గా ఉండేది. ఆ త‌ర్వాత ఆమె సినిమాల్లోకి వ‌చ్చి స్టార్ హీరోయిన్‌గా మారింది.


ఆ త‌ర్వాత ఆమె కోల్కతాకు చెందిన బిజినెస్ మేన్ నిఖిల్ జైన్ ని పెళ్లాడారు. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె ఎంపీగా గెలిచాక నిఖిల్ జైన్‌ను పెళ్లాడింది. ఆమె భ‌ర్త‌తో ఇటీవ‌ల దిగే ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమె ఫొటోల‌కు యూత్ లేడీ హాట్ ఎంపీ ఫరెవర్!! అంటూ యూత్ ఫిదా అయిపోయారు. పెళ్లి అయిన‌ప్ప‌టి నుంచి ఆమె భ‌ర్త‌తో క‌లిసి విదేశాల్లో విహార యాత్ర‌ల‌కు చెక్కేస్తోంది. 


తాజాగా ఆమె మారిష‌స్‌లో భ‌ర్త‌తో క‌లిసి చేస్తోన్న విహారం, ఆమె హాట్ ఫొటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. నుస్రత్ కెరీర్ చూస్తే 2010 మిస్ కోల్ కత గా ఆమె టైటిల్ గెలుచుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెకు వ‌చ్చిన క్రేజ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్ చక్రబర్తి తెరకెక్కించిన షొత్రు సినిమాతో 2011లో హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయారంగేట్రం చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా భాజపా అభ్యర్థి సయంతన్ బసుపై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు.


ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌త నుస్ర‌త్‌ను త‌మ త‌ర‌పుముక్క‌గా చెప్పి మ‌రీ ఎన్నిక‌ల బ‌రిలోకి దించారు. ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిని భారీ మెజార్టీతో మ‌ట్టి క‌రిపించారు. ఇక తాజాగా మారిషస్ లో నుస్రత్- నిఖిల్ జైన్ జోడీ రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పటి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు మారిసష్ విహారంలో 29 ఏళ్ల హాట్ ఎంపీ బికినీలతో చెలరేగిపోవడంపైనా వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఏదేమైనా యంగ్ ఎంపీ చాలా రొమాంటిక్‌గా లైఫ్ జ‌ర్నీ స్టార్ట్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: