మానవులు నిత్య జీవితంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడి పడేస్తున్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ అతి పెద్ద సమస్యగా మారింది. ఒక సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 120 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. నిత్య జీవితంలో ఎన్నో గృహ సంబంధిత అవసరాల కోసం మానవులు ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవటానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతోంది. 
 
ఇటీవల కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వలన సముద్రంలోని ప్లాస్టిక్ అంతా వరదలకు కొట్టుకొని వచ్చి పాలక్కాడ్ అనే జిల్లాలో ఒకే చోటుకు చేరింది. అటవీ శాఖకు చెందిన పర్వీన్ కస్వాన్ అనే అధికారి ప్లాస్టిక్ అంతా ఒకే చోట చేరిన ఫోటోను తీసి తన ట్విట్టర్లో షేర్ చేసాడు. పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్లో ప్లాస్టిక్ కు అంతం లేదు. సముద్రానికి మనం ఇచ్చిన గిఫ్ట్ ను వరద నీరు వెనక్కు ఇచ్చింది అంటూ ట్వీట్ చేసారు. 
 
ఈ ట్వీట్ ను నెటిజన్లు షేర్ చూస్తూ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటామని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ప్లాస్టిక్ స్వతహాగా హానికరం కానప్పటికీ ప్లాస్టిక్ కు రంగు ఇవ్వటానికి కొన్ని రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలతో కూడిన ప్లాస్టిక్ ఆహార పదార్థాల కొరకు ఉపయోగిస్తే ఆహార పదార్థాలు కూడా కలుషితమవుతాయి. ప్లాస్టిక్ కు రంగులు ఇవ్వటానికి వినియోగించే రసాయనాలలో క్యాన్సర్ సంబంధిత పదార్థాలు కూడా ఉంటాయి. 
 
ప్లాస్టిక్ స్వల్పకాలంలో నిత్యావసరాల కోసం ఉపయోగపడినా దీర్ఘకాలంలో ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలే ఎక్కువ.ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా క్లాత్, జనపనారతో తయారు చేసిన సంచులను వినియోగించటం శ్రేయస్కరం. ఒక ప్లాస్టిక్ కవర్ కరగటానికి దాదాపు పది లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడటం ద్వారా మనం ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: