డోలేంద్ర అక్రమ సంపాదకుడే తప్ప - పత్రికా సంపాదకుడు కాదని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు .  డోలేంద్ర పై హత్యాయత్నం మాట అబద్దమని ,  ఆయన బ్లాక్ మెయిలింగ్ చర్యలకు నన్ను వాడుకోవాలని చూశారని ఆరోపించారు .  డోలేంద్ర గత చరిత్ర అందరికి తెలుసునాని ,  తాగిన మైకంలో తనపై కేసు పెట్టారన్నారు . ఈ  కేసులో వాస్తవాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని శ్రీధర్ రెడ్డి అన్నారు .  ప్రత్యక్ష సాక్షి నా ప్రమేయం లేదని చెప్పారని పేర్కొన్నారు .  డోలేంద్ర పై దాడి అన్న వార్త విన్న ప్రపంచంలో ఉన్న నెల్లూరీయులులంతా నన్ను మెచ్చుకుంటున్నారు. ఆ వార్త అబద్దమని  అని చెప్పిన వెంటనే నిరుత్సాహ పడుతున్నారని చెప్పారు . 


జర్నలిస్ట్ పై దాడి కేసులో అధికార వైకాపా పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాటు మరో ఆరుగురు పై పోలీసులు  కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే .  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై దాడి చేశారని జమీన్ రైతు  వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆదివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు నెల్లూరు లోని మాగుంట లేఔట్ లో ఉన్న తన ఇంటికి కోటంరెడ్డి  మద్యం సేవించి వచ్చి  బెదిరించారని  డోలేంద్ర ప్రసాద్  చెప్పారు.  ఈ క్రమంలో   తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో తనసొంత ఉరుకు చెందిన డాక్టర్  చేయి పట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి లాక్కు వచ్చారని చెప్పారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు  వార పత్రిక అధినేత  డోలేంద్ర ప్రసాద్  దాడి చేశారని ఆరోపణల  నేపథ్యంలో  టిడిపి బిజెపి సిపిఎం పార్టీలతోపాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు  నిరసనలు ,  ధర్నాలు రాస్తారోకో కార్యక్రమాలు  చేపట్టారు. 

ఈ సందర్బంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విపక్ష నేతలు  పలువురు నేతలు డిమాండ్ చేశారు. వైకాపా అధికారం లోకి వచ్చిన తరువాత కోటం రెడ్డి ఒక జర్నలిస్టు తో అనుచితంగా ఫోన్ లో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెల్సిందే . ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ప్రతినిధులకు వివరించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: