గడచిన 18 సంవత్సరాల్లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు సెలవు తీసుకున్నానని అన్నారు. సాహసయాత్రకు వెళ్ళటాన్ని సెలవుగా అనుకుంటే సెలవు తీసుకున్నట్లేనని నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ అనే అడవిలో 250 రాయల్ బెంగాల్ పులులు సంచరిస్తాయి. ఇలాంటి ప్రమాదకరమైన అడవిలో నరేంద్ర మోదీ బేర్ గ్రిల్స్ అనే సాహసికుడితో కలిసి యాత్ర చేసారు. 
 
ఈ సాహస యాత్రలో నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఎవరూ ప్రయాణించని 5 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుని నడుచుకుంటూ వెళ్ళారు. భారతదేశంలో 100 భాషలు, 1600 మాండలికాలు ఉన్నాయని ప్రపంచంలో ఎక్కడా ఇంత వైవిధ్యం కనిపించదని మోదీ బేర్ గ్రిల్స్ తో అన్నారు. మోదీ, బేర్ గ్రిల్స్ రెండు పులులు ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. ఇలాంటి ప్రదేశానికి ఆయుధాలు లేకుండా వెళ్ళటం క్షేమం కాదని బేర్ గ్రిల్స్ చెబితే మోదీ సమాధానంగా ప్రకృతి ఎప్పటికీ ప్రమాదకరం కాదు. ప్రకృతితో కలిసి జీవిస్తే ప్రకృతే మనకు సహాయం చేస్తుందని మోదీ అన్నారు. 
 
బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీ బాల్యం గురించి అడగగా మోదీ బాల్యంలో టీ అమ్మిన ఙాపకాలను గురించి చెప్పారు. బేర్ గ్రిల్స్ మోదీ చేతికి కర్రకు కట్టిన కత్తిని ఇచ్చి మిమ్మల్ని కాపాడాల్సిన భాద్యత నాపై ఉందని చెప్పగా మోదీ పై వాడిపై నమ్మకం పెట్టుకుంటే ఏమీ కాదని అన్నారు. మోదీ బేర్ గ్రిల్స్ తో చిన్నప్పుడు చెరువుల్లో, నదుల్లో స్నానం చేసేవాడినని, ఒకసారి చెరువులో స్నానం చేస్తుండగా ఒక మొసలి పిల్ల దొరికిందని ఆ మొసలి పిల్లను ఇంటికి తీసుకెళితే అమ్మ జంతువులను హింసించొద్దని చెప్పటంతో మరలా నీటిలోనే వదిలానని చెప్పారు. 
 
ప్రధాని మోదీ ఈ సాహస యాత్రలో యువతలో ప్రకృతిపై ప్రేమ, సహజ వనరుల యొక్క రక్షణ గురించి చెప్పే ప్రయత్నం చేసారు. ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇప్పుడు మనం ప్రకృతి నుండి ఏదైనా తీసుకుంటే 50 సంవత్సరాల తరువాత పుట్టే  పిల్లలు ప్రశ్నిస్తారని, వారికి ఏం సమాధానం చెబుతాం? అందుకే ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మోదీ అన్నారు. గంట పాటు జరిగిన ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతిని చూపించినందుకు మోదీ బేర్ గ్రిల్స్ కు ధన్యవాదాలు చెప్పగా, బేర్ గ్రిల్స్ మోదీతో కలిసి చేసిన ఈ ప్రయాణం జీవితంలో లభించిన గొప్ప అవకాశమని అన్నారు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: