రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు బుచ్చ‌య్య చౌద‌రి తాజాగా రెచ్చిపోయారు. అది కూడా ప్ర‌తిప‌క్షం నాయ‌కుల‌పైనో.. లేదా.. అధికారిపైనో అయితే, వేరేగా ఉండేది. కానీ, ఆయ‌న సాక్షా త్తూ రెచ్చిపోయింది పార్టీ నాయ‌క‌త్వంపైనా.. పార్టీ విధానాల‌పైనే కావ‌డంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ కు వ‌స్తున్నారు. తాజాగా ఆయన రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. 2014లో నూ ఆయ‌న ఇక్క‌డ నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, గ‌త చంద్ర‌బాబు కేబినెట్‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించారు. కానీ, క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో అప్ప‌టికే ఉన్న ఓసీ కేండెట్ల లెక్క మించ‌డంతో చంద్ర‌బాబు అడుగులు వెన‌క్కి వేశారు. 


ఇక‌, 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ స‌మ‌యంలోనూ బుచ్చ‌య్య ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, దీనిపైనా చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లారు. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులు అలిగిన ఆయ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ఫోన్ కాల్‌తో మెత్త‌బ‌డ్డారు. ఇక‌, ఇంత‌లోనే ఎన్నిక‌లు రావ‌డం, రెండో సారి పార్టీ అధికారంలోకి వ‌స్తే.. తాను ఖ‌చ్చితంగా మంత్రి అవుతాన‌ని త‌న వ‌ర్గానికి చెప్పుకొచ్చారు చౌద‌రి. నిజ‌మే. టీడీపీలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. బుచ్చ‌య్య అంకిత భావంతో ప‌నిచేశారు. అన్న‌గారి హ‌యాంలో ఆయ‌న వ‌ర్గం నాయ‌కుడిగా ముద్ర ప‌డినా.. త‌ర్వాత కాలంలో బాబుకు న‌మ్మిన బంటుగా మారారు. 


ఇక‌, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్షం వైసీపీని ఇరుకున పెట్డడంలోనూ బుచ్చయ్య కీల‌కంగా వ్య‌వ‌హ రించారు. అయితే, ఆయ‌న‌ను కాద‌నికొత్త‌గా వ‌చ్చిన వారిని, అనేక మార్లు ఓడిపోయిన వారి ఎమ్మెల్సీగా దొ డ్డిదారిలో తీసుకువ‌చ్చి మంత్రులు చేయ‌డం, పార్టీ లో కీల‌క బాధ్య‌తలు అప్ప‌గించ‌డంపై ఆయ‌న కినుక వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న బ‌హిరంగంగానే త‌న అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక‌, ఇప్పుడు కూడా తాను బ‌య‌ట ప‌డ‌క‌పోతే.. ఎప్ప‌టికీ.. త‌న ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని భావించారో ఏమో.. క‌డిగిపారేశారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: