ప్రస్తుతం దేశంలో మోడీ హవా నడుస్తోంది. ఈ మాటని కేవలం బీజేపేనే కాదు..ఇతర పార్టీలు కూడా బలంగానే నమ్ముతున్నాయి. మోడీ వేవ్ కారణంగానే రెండో సారి బీజేపీ బంపర్ మెజారిటీతో కేంద్రంలో పాగా వేసింది. 2014 ఎన్నికలకంటే మెజారిటీ సీట్లు సాధించింది. అప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272 ని సొంతంగానే క్రాస్ చేసింది. ఇక మిత్రపక్షాలతో కలుపుకుని మంచిగానే సీట్లు దక్కించుకుంది. ఇక మొన్నటి ఎన్నికల్లో అయితే బీజేపీ గాలి సొంతంగా 303 సీటు గెలుచుకుని మోడీ రెండో సారి ప్రధాని అయ్యారు.


ఈ క్రమంలోనే మోడీ ఓ అరుదైన రికార్డుని బద్దలగొట్టాలని చూస్తున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సారథ్యంలని కాంగ్రెస్ పార్టీ 426 స్థానాలు గెలుచుకుంది. ఇదే లోక్ సభ ఎన్నికల్లో భారీ రికార్డు. ఇప్పుడు ఈ రికార్డుని మోడీ బద్దలగొట్టి చరిత్ర తిరగరాయాలని చూస్తున్నారు. ఈ సారి రాబోయే ఎన్నికల్లో ఈ రికార్డుని టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటి నుంచో మోడీ నాయకత్వంలోని బీజేపీ పనిచేస్తుంది.


మొన్న ఎన్నికల్లో ఏపీ, కేరళ, తమిళనాడులో తప్ప మిగతా అన్నీ రాష్ట్రాల్లో మోడీ వేవ్ బలంగానే వీచింది. కేవలం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు రాలేదు. దీంతో ఈ సారి ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. అటు తెలంగాణలో మొన్న 4 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ గెలవాలని అనుకుంటున్నారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.


ఇక ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో ఎక్కువ క్లీన్ స్వీప్ చేసేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ లలో సత్తా చాటింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్, జార్ఖండ్, ఒడిశాల్లో ఊహించని స్థాయిలో సీట్లు కైవసం చేసుకుంది. అలాగే మమతా నేతృత్వంలోనే పశ్చిమ బెంగాల్ లో సైతం 18 సీట్లు తెచ్చుకుంది. అయితే ఇంతకంటే భారీ వేవ్ సంపాదించుకుని వచ్చే ఎన్నికల్లో 426 సీట్లు దాటాలని మోడీ ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సారి మోడీ వేవ్ ఎంత బలంగా ఉంటుందో, రాజీవ్ రికార్డుని ఎలా బద్దలుగొడతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: