టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం టీడీపీ రాష్ట్ర స్థాయి స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మిగల కార‌ణాలు, భ‌విష్య‌త్తులో ఎలా పుంజుకోవాల‌నే విష‌యాల‌పై నాయ‌కులు చ‌ర్చ ప్రారంబించారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొంచెం అస‌హ‌నం కూడా ప్ర‌ద‌ర్శించారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. 


అదే స‌మ‌యంలో.. ఈ ప‌ద‌విని మ‌రో బీసీ నాయ‌కుడికి ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని తాను సిఫార‌సు చేస్తాన‌ని చెప్పారు. అయితే, ఈ అస‌హ‌నం వెనుక మ‌రో ప్ర‌త్యేక రీజ‌న్ ఉంద‌ని తెలుస్తోంది. అది కూడా బుచ్చ‌య్య వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. పార్టీలో ఆరు సార్లు గెలిచిన త‌న‌ను వ‌దిలేసి.. వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూస్తున్న నాయ‌కుల‌కు పార్టీ అధినేత ప్రాధాన్యం ఇస్తున్నారని బుచ్చ‌య్య బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. 


దీనిని బ‌ట్టి ఆయ‌న త‌న సొంత జిల్లా తూర్పు గోదావ‌రి కే చెందిన సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడునే వ్యాఖ్యానించార‌ని, విమ‌ర్శించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీలో గత ప్ర‌భుత్వంలోనూ అంత‌కు ముందు కూడా య‌న‌మ‌ల నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లోనే ఉన్నారు. వాస్త‌వానికి తుని నుంచి ఆయ‌న గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లోనూ (య‌న‌మ‌ల & ఫ్యామిలీ) ఓడిపోతూ వ‌చ్చారు. ఒక సారి ఆయ‌న ఓడిపోగా.. వ‌రుస‌గా త‌న త‌మ్ముడిని బ‌రిలో దింపినా.. గెలిచిన ప‌రిస్థితి లేదు. అయితే, పార్టీలో మాత్రం అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


ఆర్థిక మంత్రిగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా చ‌క్రం తిప్పారు. ఇక‌, పార్టీలోనూ ఆయ‌న త‌ను అనుకున్న వారికి టికెట్లు ఇప్పిస్తున్నారు. ప‌ద‌వులు వ‌చ్చేలా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నే బుచ్చ‌య్య ఆయ‌న‌పై అస‌హ‌నం పెంచుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌రుస విజ‌యాల‌తో తాను దూసుకుపోతున్నా.. త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే ఆవ‌దేన కూడా బుచ్చ‌య్య‌లో ఉంది. ఈ నేప‌త్యంలోనే ఆయ‌న య‌న‌మ‌ల‌ను టార్గెట్ చేశార‌ని అంటున్నారు. మ‌రి దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: