భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్ర‌ముఖ శృంగార తార స‌న్నీలియోన్ అదిరిపోయే షాక్ ఇచ్చారు. అదేంటి మోదీకి స‌న్నీలియోన్‌కు లింకేంటి ? ఆమె ప్ర‌ధానికి ఎలా షాక్ ఇచ్చార‌నుకుంటున్నారా ? అయితే అస‌లు విష‌యం తెలుసుకోవాల్సిందే. స‌న్నీలియోన్ ఒక్క మోదీకే కాదు.... బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్‌లకు శృంగారతార సన్నీలియోన్ షాకిచ్చారు. శ‌ృంగార తార సన్నీలియోన్ మరోసారి గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 


గ‌తేడాది తీసుకుంటే భార‌తీయులు అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సెలబ్రిటీల్లో సన్నీలియోన్ టాప్ ప్లేసులో ఉన్నారు. ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్‌లను దాటేశారు. ఆమెను ఫాలో అయ్యేవాళ్లు, ఆమెకోసం స‌మాచారం సెర్చ్ చేసేవారు మోదీ కంటే ఎక్కువ మందే ఉన్నారు.


ఇక గత ఏడాది కూడా ఆమె అగ్రస్థానంలో నిలిచారు. గూగుల్ ఎనలిటిక్స్ ప్రకారం.. సన్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సన్నీ కుటుంబ సభ్యులు, ఆమె బయోపిక్ `కరణ్ జీత్ కౌర్..ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్` , తదితర అంశాల గురించి గూగుల్‌లో నెటిజన్స్ అత్యధికంగా సెర్చ్ చేసిన‌ట్టు గూగుల్ గ‌ణాంకాలు వెల్ల‌డించారు.


ఒక దేశ ప్ర‌ధాన‌మంత్రి..అందులోనూ ఏకంగా 120 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న మోదీ కంటే స‌న్నీలియోన్‌కే ఈ స్థాయిలో క్రేజ్ ఉందంటే అది మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. దీనిపై సన్నీలియోన్ స్పందిస్తూ త‌న‌కు ఇండియాలో ఇంత క్రేజ్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పిన ఆమె ఇది త‌న అభిమానుల వ‌ల్లే జ‌రిగింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


త‌న అభిమానులు త‌న‌కు అందిస్తోన్న సపోర్ట్‌ చూస్తే గొప్పగా అనిపిస్తుంద‌ని స‌న్నీ తెలిపారు. ప్రస్తుతం ఈమె `కోకాకోలా` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఏదేమైనా వ‌రుస‌గా రెండు సంవ‌త్స‌రాల పాటు ఆమె గూగుల్ సెర్చింగ్‌లో మోదీ కంటే టాప్ ప్లేసులో నిల‌వ‌డం విశేష‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: