కృష్ణానది  పరివాహక  ముప్పు ప్రాంతాలను మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి సందర్శించారు . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు .  మంగళవారం  రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌ నుంచి అవుట్‌ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు  అంచనా  వేస్తున్నారని చెప్పారు . మత్స్యకారులతో   మాట్లాడి ఎమ్మెల్యే ఆర్కే,   వేటకు వెళ్లొద్దని సూచించారు .  ఎటువంటి ఇబ్బంది  లేదని ప్రభుత్వం అన్ని విదాల అందుకుంటుందని హామీ ఇచ్చారు . లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , లోతట్టు ప్రాంతవాసులకు సహాయ సహకారాలను  అందించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉన్నారని ఆర్కే  తెలిపారు.


 అయితే ఒకవైపు జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తుంటే , మరో రెండు, మూడురోజులు  తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా  వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు . ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్న విషయం తెల్సిందే . ఇక రెండు, మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిస్తే జలాశయాలు ప్రమాదకరస్థాయి లో ప్రవహించే అవకాశాలు లేకపోలేదు .  రెండు రాష్ట్రాల్లో  గత కొద్దిరోజుల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్న విషయం  తెలిసిందే. ఒకటి, రెండురోజుల విరామం  తర్వాత మళ్లీ భారీ  వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  అధికారులు  చెబుతున్నారు .


 మంగళవారం రాత్రి నుంచి వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగాల్ దక్షిణం, ఉత్తర ఒడిశాలో కేంద్రికృతమైంది. 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: