బాగా చదువుకున్నాక విదేశాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు.  విదేశాలకు వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరికి మొదట అమెరికా వెళ్లాలని ఉంటుంది.  అక్కడ ఉద్యోగం సంపాదించుకొని సెటిల్ కావాలని ఉంటుంది.  అయితే, ఆ అదృష్టం కొంతమందికే వస్తుంది.  గతంలో ఒబామా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇండియాకు వీసాలు ఈజీగా వచ్చాయి.  


ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి మొత్తం మారిపోయింది.  ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు.  లోకల్ వ్యక్తులకు జాబ్స్ ఇవ్వాలని పట్టుబట్టాడు.  దానికి తగ్గట్టుగా చట్టాలు చేసుకుంటూ వచ్చాడు. ఉద్యోగాల  కోసం వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లిన చాలామంది   శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు కు అప్లై చేసుకుంటారు.  


గతంలో గ్రీన్ కార్డు ఈజీగా వచ్చేది.  కానీ, ఇప్పుడు రావడం లేదు.  గ్రీన్ కార్డు విధానంలో మార్పులు తీసుకొచ్చాడు ట్రంప్.  ప్రభుత్వం ప్రవేశ  పెట్టిన  పధకాలను ఎవరైతే  వాడుకుంటారో వారికి గ్రీన్ కార్డు వర్తించదు.  గ్రీన్ పొందటానికి వారు అనర్హులు అని  ప్రభుత్వం  తేల్చి చెప్పింది.   ట్రంప్ ఆదేశాలను అమలుచేస్తే దాని వలన ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, కరేబియన్ దీవులు తదితర దేశాలకు దీని వలన  ఇబ్బందులు  పడే అవకాశం ఉంది.  


తాజా సమాచారం ప్రకారం మరో 60 రోజుల్లో ఈ బిల్లు అమలు కాబోతున్నది.  చట్టబద్ధంగా వీసాలు ఉండి అమెరికాలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వారి సంఖ్య దాదాపుగా 2.6 కోట్ల  తెలుస్తోంది.  ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.  సో, వీరంతా ఇక గ్రీన్ కార్డ్ పొందడానికి అనర్హులేనా.. కేవలం వీసాపై మాత్రమే అక్కడ ఉండటానికి అర్హులా.. పైగా అంతకు ముందులా హెచ్ 1 బి వీసాలు  పొందటం ఈజీ  కావడం లేదు.  చాలా కష్టంగా మారింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: