ఇండియా పాకిస్తాన్ ల మైత్రి ప్రస్తుతం ఘోరంగా ఉన్నది.  పాకిస్తాన్ కు చెందిన ప్రధాన మంత్రి మొదలు సాధారణ మంత్రుల వరకు భారత్ ను విమర్శించడం మొదలుపెట్టారు.  భారత్ లో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  వివిధరకాల మాటలు అంటున్నారు.  భారత్ మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు.  


ఇప్పుడు సైన్యంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించింది.  పాకిస్తాన్ మంత్రి ఫవాద్ సైన్యాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  భారత్ సైన్యంలో పంజాబ్ సైనికులు పనిచెయ్యొద్దని.. వారికీ సైన్యంలో అన్యాయం జరుగుతుందని అన్నాడు. ఇండియా సైన్యంలో ఎక్కువమంది పంజాబ్ నుంచే వస్తుంటారు.  వారికీ సైన్యంలో పనిచేయడం చాలా ఇష్టం.  అందుకే వారు సైన్యంలో చేరుతుంటారు.  


పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తిప్పి కొట్టారు.  భారతీయ సైనికులు క్రమశిక్షణ కలిగి ఉంటారు.  ఎక్కడా అదుపుతప్పి ప్రవర్తించరు.  పాక్ సైనికుల్లా క్రమశిక్షణ లేకుండా ఉండరు అని ఘాటైన జవాబు ఇచ్చారు.  అమరిందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అందరి మెప్పును పొందుతున్నాయి.  ఇండియాలో మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు.  


బయటి వ్యక్తులు మనల్ని ఏదైనా అంటే అందరం కలిసి రియాక్ట్ కావాలి.  అమరిందర్ సింగ్ అదే చేశారు.  సైన్యం పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి సైన్యం గురించి ఆయనకు బాగా తెలుసు.  సైన్యం క్రమశిక్షణ గురించి తెలుసు.  అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇండియాను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలనీ పాక్ చూస్తోంది.  కానీ, ఆ పప్పులు ఉడకడం లేదు.  రష్యా మొదలు అన్ని దేశాలు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి.  భద్రతా మండలి మనకు పూలమాలతో స్వగతం పలకడం లేదని ఇప్పటికే పాక్ విదేశాంగ శాఖా మంత్రి స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: