ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన పెట్టుబడుల సదస్సు ఖరారయ్యేనా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఒక పక్క జగన్ ప్రభుత్వం సంస్కరణల పేరిట అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టింది. దీంతో  అభివృద్ధి పనులను నిలిపేశారంటూ ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల సదస్సు అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లద్‌ సింగ్‌ పటేల్‌ను  ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీసీ రాజ్యసభ ఎంపీ  విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.



ముఖ్యంగా స్వదేశీ  దర్శన్  పథకం కింద నిధుల విడుదల, విశాఖపట్నం లో నిర్వహించ తలపెట్టిన పర్యాటక శాఖ పెట్టుబడుల సదస్సు తేదీల ఖరారుపై చర్చించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం  స్వదేశీ దర్శన్‌ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు  చెప్పారు. గతం ప్రభుత్వం పట్టించుకోని కారణంగా రాష్ట్రానికి ఈ పథకం ద్వారా నిధులు రాలేదని ఆయన చెప్పారు. దీనితో స్వదేశి దర్శన్‌ కింద 900 కోట్లకు ప్రతిపాదనలు కేంద్ర మంత్రి కి  ఇచ్చినట్లు ఆయన తెలిపారు.



దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆలాగే త్వరలో అమరావతి లేదా విశాఖపట్నంలో పర్యాటక రంగంలో పెట్టుబడులపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు కేంద్రం పర్యాటక మంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించామని ఆయన  సమయాన్ని ఇచ్చేదాన్ని  బట్టి సదస్సు  తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ నెల 25న జరిగే పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో  రాష్ర్టంలో జరిగే పెట్టుబడుల సదస్సు తేదీలు ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లుగా అవంతి శ్రీనివాస్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: