73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  ఈ ఉదయం కెసిఆర్ గోల్కొండ కోటాలో జాతీయ జెండాను ఎగరవేశారు.  తెలంగాణా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  గత ఐదేళ్లతో తెలంగాణా తెలంగాణాను అభివృద్ధి చేయడానికి ఎలాంటి పనులు చేశారు.  వాటి వలన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలను చెప్పారు.  


ప్రసుత్తం ఎగువున విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణాలో ఉన్న జలాశయాలు అన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి.  జలాశయాలు నిడటంతో రైతులు సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో సాగు చేయడానికి కావాల్సిన నీరు పుష్కలంగా ఉన్నది. మూడు పంటలను పండించడానికి కావాల్సిన నీరు ఉన్నది.  చేయాల్సింది రైతులు పనులు మొదలుపెట్టడమే
.  
దేశానికీ రైతు వెన్నుముక అని మహాత్మాగాంధీ గారు అన్నారు.  దానిని నిజం చేసే దిశగా కెసిఆర్ సర్కార్ నడుం కట్టింది. గతంలో నీరు లేక పంటలు సరిగా పండలేదు.  ఉమ్మడి రాష్ట్రంలో ప్రోజెక్టుల రూపకల్పన కూడా అంతంత మాత్రంగానే ఉన్నది.  నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కెసిఆర్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  రాష్ట్రం విడిపోయాక.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకున్నారు. 


మరికొన్ని చోట్ల ఎత్తిపోతల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు.  గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని జలాశయాలన్నీ నిండాయి.  కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు వచ్చింది.  తెలంగాణాలో బోరుబావులు వేసుకునే అవసరం ఇకపై ఉండబోదని తెలుస్తోంది.  హామీ ఇచ్చినట్టుగా రైతులకు రుణాల మాఫీని చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది.  ఇకపై రాష్ట్రం అంతటా పచ్చగా ఉంటుందని, ఆకుపచ్చని తెలంగాణా సాధ్యం అవుతుందని కెసిఆర్ చెప్పడం విశేషం.  బంగారు తెలంగాణ విషయంలో ఇప్పటికే సర్కారు అడుగులు ముందుకు వేసింది.  ఉద్యోగాల కల్పన దగ్గరి నుంచి అన్ని విషయాల్లోనూ పోటీ పడుతున్నది.  ఇపుడు సర్కార్ ఆకుపచ్చని తెలంగాణా బాధ్యతను భుజాన వేసుకుంది.  రాష్ట్రాన్ని పచ్చగా సుభిక్షంగా ఉంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: