ఏ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ సమస్యపై ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేశారో అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు..ఒకదశలో దేశానికి దీపావళి పండుగ వచ్చిందా..రాక్షస సంహారం జరిగిందా అన్నంతగా తలపిస్తుంది.  దేశ వ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఆర్టికల్ 370 అనే పదమే వినిపిస్తుంది.  కొంత మంది నేతలు చేసి చీకటి ఒప్పందం చీల్చుకొని వెలుగులోకి వచ్చినట్లు అనిపిస్తుంది.  ప్రధాని మోదీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలన్నింటిని మంత్రముగ్దులను చేశాయి..ఒక్క పాకిస్థాన్ తప్ప.


అయితే  ఆర్టికల్‌ 370 రద్దుపై పార్లమెంట్‌లో చర్చ సమయంలో తన సంచలన వ్యాఖ్యలతో సభలోని అందరిని తనవైపు తిప్పుకున్న  లద్దాఖ్‌ ఎంపీ జమ్మాంగ్‌ నంగ్యాల్‌ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. అంతే కాదు అక్కడి సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రజల మద్య ఒక సామాన్యుడిగా నృత్యం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం సంప్రదాయ డప్పును అలవోకగా వాయించారు. కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో  లద్దాఖ్‌ ఎంపీ జమ్మాంగ్‌ నంగ్యాల్‌  మాట్లాడుతూ..నేను లద్దాఖ్‌కు చెందిన వ్యక్తిని. ప్రత్యేక లద్దాఖ్‌పై ఇక్కడి ప్రజలకు మాటిచ్చాను...నా మాటలు ప్రజలు నమ్మారు..అందుకే నాకు ఓటు వేసి గెలిపించారు..వారికి నేను ఇచ్చిన మాటల నిలబెట్టుకోవాలా తప్పాలా?..ఒక నాయకుడిగా మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. 

అంతే కాదు ఈ విషయంపై ప్రతిపక్షాలు ఇంకేం మాట్లాడినా తప్పున పడతారని ఒకరకంగా హెచ్చరించారు. ఈ ప్రసంగం కాస్తా వైరల్‌ కావడంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు. సోషల్‌ మీడియాలో ఈయనను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది.   ఇదిలా ఉంటే లద్దాఖ్‌కు  కేంద్రపాలిత ప్రాంత హోదా రావడంపై అక్కడి ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. జాతీయ జెండాను  చేతిలో పట్టుకుని వీధుల్లో స్టెప్పులేసుకుంటూ వెళుతున్న ఆయన  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: