బలూచిస్తాన్.. పాకిస్తాన్ లో భాగం. ఇప్పుడు ఇది స్వాతంత్రం కావాలని కోరుకుంటోంది.  1947లో పాకిస్తాన్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా బలూచిస్తాన్ వేరుగా ఉండేది.  స్వంతంత్రగా ఉండేది.  కానీ, పాక్ ఆ ప్రాంతాన్ని  ఆక్రమించుకుంది.  దీంతో అప్పటి నుంచి బలూచిస్తాన్ పాక్ లో భాగం అయ్యింది.  ఈ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి.  



వీటిని పాక్, చైనీయులు అక్రమంగా దోచుకువెళ్తున్నారు.  తమ భూభాగంలోని సహజవనరులను దోచుకుపోయారుగాని, తమ గురించి పట్టించుకోవడం లేదని పాపం వాళ్ళు ఆవేదన చెందుతున్నారు.  అత్యంత  ఖరీదైన సహజవనరులు ఉన్న ప్రాంతంలో వెంబడిన ప్రాంతంగా ఉండిపోవడం వెనుక చాలా పెద్ద రహస్యం ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా అలా వదిలేస్తే.. దాని జోలికి ఎవరూ వెళ్లరు.  



అలాంటి సాహసం కూడా చేయరు.  అలా కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.  ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ వనరులపై దృష్టి పడుతుంది.  ఫలితంగా వాటిని దోచుకునే ప్రయత్నం చేస్తారు అనే వాదనతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచేసింది పాకిస్తాన్.  



గత కొంతకాలంగా తమకు స్వాతంత్రం కావాలని పోరాటం చేస్తున్నారు బలూచిస్తాన్ ప్రజలు.  వీరి మాటలను అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఉద్యమం చేస్తున్న చాలామంది ఏమైపోయారు ఇప్పటి వరకు అంతులేదు.  వళ్ళంతా ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.  అసలు ఉన్నారా లేరా అన్నది ఎవరికీ తెలియడం లేదు.  తమ స్వతంత్ర పోరాటానికి ఇండియా మద్దతు ఇవ్వాలని, ఇండియా మద్దతు ఇస్తే తప్పకుండా తమకు స్వతంత్రం వస్తుందని అంటున్నారు అక్కడి ప్రజలు.  మరి వాళ్లకు ఇండియా మద్దతు ఇస్తుందా.. చూద్దాం.   పాకిస్తాన్ మాత్రం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని అక్కడి ప్రజలు సహకరించడం లేదని చెప్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: