నిన్న కృష్ణా నదిలో కొద్దిగా తగ్గిన వరద మళ్లీ భారీగా పెరుగుతోంది. ఎగువ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగులకు చేరి గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు గేట్లు మొత్తం ఎత్తివేసి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. బ్యారెజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పవిత్ర సంగమం,, ఇబ్రహీంపట్నంలోని రోడ్ల మీదకు వరద నీరు చేరుతోంది. ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు.

 

విపత్తు నిర్వహణశాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది. గుంటూరు జిల్లాలో పెద్దమద్దూరు గ్రామాన్ని వరద ముంచెత్తింది. వరదకు అమరేశ్వరాలయం నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. మోపిదేవి, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం హరిజనవాడ, బొబ్బర్లంక గ్రామస్థులను కూడా ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


 

శ్రీశైలం డ్యామ్ :

  • ఇన్‌ఫ్లో 8.32 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 8.58లక్షల క్యూసెక్కులు ఉంది.
  • ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులకు.. 881.40 అడుగుల వద్ద ఉంది.
  • ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు.. ప్రస్తుతం 195.66 టీఎంసీల వద్ద ఉంది.
  • 10 గేట్ల ద్వారా 7.51వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు.

 

నాగార్జునసాగర్‌ :

  • ఇన్‌ఫ్లో 7 లక్షలకు పైగా క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 6.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
  • ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 586 అడుగులుగా ఉంది.
  • ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలైతే.. ప్రస్తుతం 304 టీఎంసీలు ఉంది.
  • 26 గేట్లద్వారా 6లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

 

పులిచింతల :

  • ఇన్‌ఫ్లో 7లక్షలకు పైగా క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 7 లక్షల వరకూ ఉంది.
  • ప్రాజెక్టు నీటిమట్టం 175 అడుగులకు ప్రస్తుతం 170 అడుగులుగా ఉంది.
  • ప్రాజెక్టు నిల్వసామర్థ్యం 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 39 టీఎంసీలుగా ఉంది.
  • 22 గేట్లద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: