సివిల్స్ కి ప్రిపేర్ కావడం ఎంతోమంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కష్టపడి పరీక్షలకు ప్రిపేరై ర్యాంకులు సాధిస్తారు. ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వంలో పోస్టులు వస్తే వారి కల సాకారమైనట్టే. వారి కలలను సాకారం చేస్తూ ప్రభుత్వం పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారులు ఐఏఎస్‌ కేటాయించారు. మరో తొమ్మిది మందికి ఐపీఎస్‌, ఇద్దరికి ఐఎఫ్‌ఎస్‌ కేటాయించారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 31 మంది పోస్టులు దక్కించుకున్న వారిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 644 మందికి ఈ సర్వీసులు కేటాయించారు. వీరందరికీ ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, ముస్సోరిలో ప్రాథమిక శిక్షణ ప్రారంభమవుతుంది. ఇది డిసెంబరు 6వ తేదీ వరకు కొనసాగుతుంది. గతంలో ఇలా పోస్టులు దక్కించుకున్నవారికి  నాలుగు చోట్ల శిక్షణ ఇచ్చేవారు. ఈ సారి కేవలం రెండు ప్రదేశాలకు మాత్రమే  కుదించి శిక్షణ ఇస్తున్నారు.

 

 

ఈ మధ్య కాలంలో అన్ని రకాల శిక్షణకు హైదరాబాద్‌ నగరం భారత్‌కు కేంద్రంగా మారుతోందని బ్రెయిన్‌ ట్రీ శిక్షణ సంస్థ సంచాలకుడు గోపాలకృష్ణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాలుగు చోట్ల తీసుకునే శిక్షణ ఇప్పుడు హైదరాబాద్ లోనే కొంతవరకూ అందించేందుకు పూర్తి స్థాయిలో వనరులున్నాయని అన్నారు.

 

సర్వీసుకు ఎంపికైన తెలుగు వారి వివరాలు ఇవే..

 

1. కర్నాటి వరుణ్‌రెడ్డి

2. అబ్దుల్‌ షాహిద్‌ 

3. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ 

4. మల్లవరపు నవీన్‌

5. విష్ణుచరణ్‌

6. అశ్విజ

7. వైష్ణవి

 

వీరంతా త్వరలోనే త్వరలోనే శిక్షణకు వెళ్లనున్నారు. శిక్షణలో అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన విషయాలు, విధులు మొదలైన అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: