కృష్ణానది కరకట్టపై నిర్మించిన భవనం లో నివసిస్తోన్న  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను వెంటనే  ఖాళీ చేయాలని ఉండవల్లి తహశీల్ధార్ నోటీసులు జారీ చేశారు . ఈ మేరకు చంద్రబాబు నివసిస్తోన్న ఇంటికి వెళ్లిన వీఆర్వో నోటీసులు అందజేసేందుకు ప్రయత్నించగా , ఇంట్లో ఎవరు లేరని భద్రతా సిబ్బంది సమాచారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది . భద్రతా సిబ్బంది వీఆర్వో ను ఇంట్లోకి అనుమతించకపోవడంతో అయన చాల సేపు ఇంటి బయటే వేచి చూసి వెనుతిరిగినట్లు సమాచారం .


ఒక్క చంద్రబాబు నివాసానికి కాకుండా , కరకట్టపై నిర్మించిన అన్ని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి , ఇళ్లను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు . గత రెండు రోజులుగా కృష్ణానది కరకట్టపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చే  అవకాశమున్న నేపధ్యం లో రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే  నోటీసులు జారీ చేశారు . ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం హైడ్రామా నడిచిన విషయం తెల్సిందే .  డ్రోన్ల ద్వారా వరద దృశ్యాల  చిత్రీకరణ వల్ల తన భద్రతను ప్రశ్నార్ధకం చేశారని  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం, చంద్రబాబు ఇంటిని నీట ముంచేందుకు అధికార వైకాపా కుట్ర పన్నుతోందని టీడీపీ నేతలు, కార్యకర్తలు  ఆందోళనకు దిగారు .


అంతలోనే  పోలీసుల రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు   ప్రయత్నించారు .. అయితే  చంద్రబాబు ఇంటి సమక్షం లో టీడీపీ కార్యకర్తలకు , పోలీసులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకోవడం తో ఒక్కసారిగా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది . వరద నీటిని సక్రమంగా నిర్వహించడం చేతకాక , వైకాపా సృష్టించిన వరద వల్లే చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు ప్రవేశించాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: