ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌స్తుతం వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. గోదావ‌రి, కృష్ణా న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో పంట‌ల‌తో పాటు ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు నీట ముంపున‌కు గుర‌య్యాయి. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ద రాజ‌కీయం జోరందుకుంది. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. బాబుకు సెంటు భూమి కూడా లేద‌ని... ఆయ‌న ఇంటి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే త‌మ ప్ర‌భుత్వం ఇళ్లు ఇచ్చిన‌ప్పుడు త‌మ గ్రామ వ‌లంటీర్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లి సెంటో లేదా సెంటున్న‌రో ఇంటి స్థ‌లం ఇస్తార‌ని ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇక మ‌రో వైసీపీ నేత అంబ‌టి రాంబాబు కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ బాబు ఇప్ప‌ట‌కి అయినా బాధ్య‌తాయుత ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న ఇళ్లు ఖాళీ చేయాల‌ని సూచించారు. వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన బాబు త‌న‌ ఖాళీ చేయ‌కుండా మొండిగా ఉన్నా.. ఆయ‌న రాజ‌కీయ‌ జీవితం ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌ల కోపంలో మునిగిపోయింద‌న్నారు. ఇక ఇటు చంద్ర‌బాబు కూడా త‌న‌పై కుట్ర చేస్తున్నాని మండిప‌డ్డారు.


ఇక ఇప్పుడు ఈ ఇష్యూలోకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దూరేశారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై స్పందించిన ప‌వ‌న్ వరదల్లో చికుకున్న ప్రజల గురించి ఆలోచించాల్సి పోయి కరకట్ట మీదా ఉన్న ఇల్లు మునుగుతాయో లేదో నని డ్రోన్లను తిప్పెందుకేనా ప్రజలు మిమల్ని 151 సీట్లు ఇచ్చి గెలిపించిందని అని విమ‌ర్శించారు.


ఈ క్ర‌మంలోనే వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప‌వ‌న్ నిల‌దీశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని వరుదల్లో ముంచేస్తారా? అంటూ విపక్షం ప్రశ్నిస్తుంటే అది మునిగిందో లేదోనని అధికార పక్షం వెళ్లి చూస్తోందని అసహనాన్ని వ్యక్తం చేసారు పవన్ ...వీటిని రాజకీయం చేయకుండా ముందుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఏదేమైనా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ మ‌రోసారి చంద్ర‌బాబుకు స‌పోర్ట్‌గా మాట్లాడిన‌ట్టే క‌నిపిస్తోంది. ప‌వ‌న్‌కు, బాబుకు ఉన్న పాత లింకులు, స్నేహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చివ‌ర‌కు బాబు ఇళ్లు మునుగుతుంటే ఆయ‌న ఖాళీ చేయ‌క‌పోయినా త‌ప్పుప‌ట్ట‌ని ప‌వ‌న్ ఆయ‌న్నే వెన‌కేసుకు రావ‌డం విచిత్ర‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: