టీఆర్ఎస్ కీల‌క నేత‌ల్లో మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమారు ఒక‌రు. అందులోనూ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఉద్య‌మ కాలం నుంచీ అనేక కీల‌క ఘ‌ట్టాల్లో ఆయ‌న పాలుపంచుకున్నారు. ఢిల్లీలోనూ అనేక ప‌నుల‌ను చ‌క్క‌దిద్దారు. అయితే.. ఇటీవ‌ల పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. క‌రీంన‌గ‌ర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్ బీజేపీ అభ్య‌ర్థి బంది సంజ‌య్ చేతిలో ఓడిపోయారు. 


అయితే.. ఎక్క‌డ కూడా ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గ‌కుండా.. అటు ప్ర‌భుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ ఆయ‌న ప‌ర‌ప‌తి మ‌రింత పెంచేలే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా వినోద్‌కుమార్‌ను నియ‌మించారు. నిజానికి.. వినోద్‌కుమార్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. అనేక స‌మీక‌ర‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద ప‌లు కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌లు ఉన్నాయి. ఇందులో ఆర్థిక శాఖ కూడా ఉంది. 


ఈ శాఖ‌ల ప‌నుల‌ను పూర్తిస్థాయిలో చ‌క్క‌దిద్దే స‌మ‌యంలో కేసీఆర్ కు ఉండ‌డం లేదు. ఇక మ‌రొక అత్యంత ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. వ‌చ్చే నెల‌లోనే 2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించిన పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌కు వినోద్‌కుమారే అన్నివిధాలుగా స‌రైన స‌మ‌ర్థుల‌ని భావించిన కేసీఆర్ ఆయ‌న‌కు ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్ష‌ప‌ద‌వికి క‌ట్ట‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. 


అయితే.. ఇప్పుడిక వినోద్‌కుమార్ మంత్రికాని ఆర్థిక మంత్రి అన్న‌మాట‌. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో ఆయ‌న కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. అన్నిశాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. బ‌డ్జెట్ రూపొందించే బాధ్య‌త‌ను తీసుకుంటార‌న్న‌మాట‌. అయితే.. మ‌రొక విష‌యం..  ఈ బాధ్య‌త వినోద్‌కుమార్‌కు స‌వాలేన‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఏం కొంచెం తేడా రాకుండా.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను మెప్పించ‌డం అంత స‌లువైన ప‌నేంకాదు మ‌రి. ఇక ఇదేస‌మ‌యంలో ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వంలో వినోద్‌కుమార్‌ది అత్యంత కీల‌క పాత్ర అని ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్ర‌హించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: