ఆంధ్ర  ప్రదేశ్ లో  టీడీపీ నేతలు వరద ను రాజకీయం చేయాలని చూస్తున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు . టీడీపీ నేతలు  చేస్తోన్న వరద, బురద రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు . వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  వై యెస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాలతో వరద బాధితులను ఆడుకునేoదుకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు . వరదల్లో ఇబ్బందుల లో ఉన్నవారిని ఆదుకునేందుకు టీడీపీ నేతలు  ప్రయత్నo చేయాలని అంతేకాని ప్రభుత్వం పై బురద చల్లాలని చూస్తే ప్రజలు హర్షించారని హెచ్చరించారు .


చంద్ర బాబును హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉందన్న జోగి రమేష్ , ప్రజలు టీడీపీని, చంద్రబాబును రాజకీయoగా సమాధి చేశారన్నారు . ఆంధ్ర ప్రదేశ్ లో వరద పై అధికార, ప్రతిపక్ష పార్టీ ల మధ్య వరదల నేపధ్యం లో విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు , ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి . చంద్రబాబు నివాసాన్ని నీట ముంచేందుకే వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా నీటిని విడుదల చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . సకాలం లో నీటిని కిందకు వదిలి ఉంటే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంట్లోకి నీళ్లు వచ్చి ఉండేవి కావని అంటున్నారు .


 అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన మరొక విధంగా ఉంది . చంద్రబాబు నివాసం నీట మునుగుతుందని  తెలిసే , హైదరాబాద్ పారిపోయారని విమర్శిస్తున్నారు . కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణం లో ఉండడమే కాకుండా , చంద్రబాబు ఆయన గ్యాంగ్ వరదను రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు . వరదలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండి జలకళ సంతరించుకుంటే  రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తుంటే , బాబు బ్యాచ్ కు మాత్రం కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: