Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 7:18 pm IST

Menu &Sections

Search

జగన్ చూసి చూడనట్టు పారిపోయాడేమిటి!!

జగన్ చూసి చూడనట్టు పారిపోయాడేమిటి!!
జగన్ చూసి చూడనట్టు పారిపోయాడేమిటి!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

"నీ వున్నాను." అనే జగన్, తూర్పు గోదావరి రాష్ట్రంలో భారీగా వరదలు వస్తున్నాయని తెలిసి కూడా అదేమీ పట్టనట్టుగా, ముందస్తు చర్యలు చేపట్టకుండా సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎప్పుడూ తానున్నాను.. తాను విన్నాననే జగన్మోహన్‌రెడ్డి.. తాను చూడనంటూ అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయాంలో వరదలు వస్తే ఎప్పుడు ఏ బ్యారేజీకి ఎంత నీరు వస్తుందో ముందుగానే గ్రహించి చర్యలు తీసుకునేవారన్నారు. జులై 25 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వస్తాయని... కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు హెచ్చరించినప్పటికీ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారులు రివర్స్ టెండరింగ్ చుట్టూ... మంత్రులు చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతున్నారని చినరాజప్ప విమర్శించారు.


ఫలితంగా ఇళ్లు మునిగిపోయి, ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. రైతులు లక్షల ఎకరాల్లో పంటను నష్టపోయారన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో పూర్తిగా నీరు నిండకుండానే ఎందుకు కిందకు వదిలారని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి నిల్వ ఎక్కువయ్యే కొద్దీ నీటి మట్టం పెరిగి చంద్రబాబు ఇంట్లోకి నీరు ప్రవేశిస్తుందన్నారు. అమరావతి మునిగిందని, రాజధానిపై విష ప్రచారం చేసే కుట్రకు తెరదీశారన్నారు.


చంద్రబాబు ఇంట్లో లేనప్పుడు ఆయనను కాపాడేందుకే అని ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారి చర్యలన్నియూ ఒక ప్రక్క, ఈ తెలుగు ప్రజలు చూస్తున్నారని, ఇంకా వాళ్ళ నాటకాలు ఎన్నాళ్ళో సాగవని, ఏది ఏమైనా వారి ఆటలు మూన్నాళ్ళ ముచ్చటే అని, రానున్న ఎలక్షన్లలో మాదే పై చేయి అని చాల కరాఖండిగా చెప్పారు. తెలుగు దేశానికి అపూర్వ వైభవం రాబోతోందని, ఇంకా ఎన్ని రోజులో లేదని, రాబోతున్నది మంచి తరుణమని, చిలక జోస్యం చెప్పారు.


rajappa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెప్టెంబర్ 21 నుంచి ఆర్‌బీఐలో 'గ్రేడ్-బి' ఆఫీసర్స్ పోస్టులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి : తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అక్కినేని నాగ్ ఎమోషనల్ పోస్ట్
షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ Mi TV రిలీజ్.. యూజర్లకు గుడ్ న్యూస్!
బిగ్ బాస్ సీజన్ త్రీ మొదటిసారి కెప్టెన్ నిల్చిన మహేష్ విట్టా.. గురువుపై శిష్యుడు విజయం
‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభం
‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సేఫ్ గేమ్
రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ సపోర్ట్
ఈరోజే దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్
అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న భారత్
ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్
బిగ్ బాస్ - 3 లో ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా?
సినిమా తాజా వార్తలు ....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.