తెలంగాణాలో పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జెపి నడ్డా తెలంగాణ వచ్చిన తరువాత ఇక్కడ కూడా ప్రకంపనలు మొదలయ్యాయి.  తెరాస పార్టీ పై జెపి నడ్డా విరుచుకుపడ్డారు. ప్రోజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విరుచుకుపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు 28 వేల కోట్ల రూపాయల నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఎందుకు పెరిగిందని జెపి నడ్డా అన్నారు.  



బంగారు తెలంగాణా నుంచి కల్వకుంట్ల తెలంగాణాగా మారిందని జెపి నడ్డా విమర్శించారు.  జెపి నడ్డా విమర్శించడంతో.. ఈరోజు కేటీఆర్ జెపి నడ్డా వ్యాఖ్యలపై స్పందించారు.  రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్‌, భాజపా నాయకులకు నచ్చడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన విమర్శలు ఇప్పుడు సంచలంగా మారాయి.  ఇక్కడితో ఆగకుండా కేటీఆర్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. 



తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క పథకమైనా భాజపా పాలితప్రాంతాల్లో ఉందా’?అని కేటీఆర్‌ ప్రశ్నించారు. భాజపా నేతలు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపెట్టాలని సవాల్‌ విసిరారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేటీఆర్‌ అన్నారు. మన రాష్ట్రంలోని పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు.  కేటీఆర్ చేసిన ఆయుష్మాన్.. ఆరోగ్యశ్రీ  వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి.  



కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్ పధకం అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది.  అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపేట్టిన ఆరోగ్యశ్రీ పధకం అనేక సమస్యలను ఎదుర్కొంటు ఆగిపోయింది.  గత నాలుగు రోజులుగా ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోవడంతో.. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రోగులను పక్కన పెట్టింది. బకాయిలు చెల్లించడం లేదని ఆందోళన చేస్తున్నారు.  ప్రభుత్వ హాస్పిటల్స్ లు రోగులు క్యూకడుతుండటంతో అక్కడ వైద్య సేవలు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: