కృష్ణానది కరకట్టపై వరద అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ  డ్రోన్ ను వినియోగించడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది . మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పై ఇటీవల డ్రోన్ ఎగరడం పట్ల  ఆ పార్టీ నేతలు  తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.  వరద అంచనాల కోసమే జలవనరుల శాఖ అద్వర్యం లో  డ్రోన్  ద్వారా  చిత్రీకరణ చేయడం జరిగిందని వివాదాన్ని ముగించే ప్రయత్నాన్ని ఆ  శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు . అయినప్పటికీ తమ్ముళ్లు వినలేదు .


 మాజీ ముఖ్యమంత్రి భద్రతను ప్రమాదం లోకి నెట్టేందుకే  వైకాపా నేతలు కుట్ర పన్ని  డ్రోన్ ద్వారా చంద్రబాబు ఇంటిని చిత్రీకరించారని   వారు ఆరోపించారు.  ఈ విషయమై తాజాగా డీజీపీ  గౌతమ్ సవాంగ్ స్పందించారు.  వరదల  అంచనాల కోసమే జలవనరులశాఖ డ్రోన్ వినియోగించిందని, స్థానిక  పోలీసులకు సమాచారం లేకపోవడం వల్లే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చెప్పారు . చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరడం లో  ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చి చెప్పారు.  డ్రోన్ వినియోగాన్ని  రాజకీయం చేయవద్దన్న అయన ,  ఎవరైనా ఇకపై   డ్రోన్లు ఉపయోగించాలంటే స్థానిక పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు .  ఇరిగేషన్ శాఖ అధికారులకు,  స్థానిక పోలీసులకు  మధ్య సమన్వయలేమి  కారణంగానే ఈ వివాదం నెలకొంది గౌతమ్ సవాంగ్ తెలిపారు.


 ఇటీవల ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పై  చంద్రబాబు నివాసం ఉంటున్న  ఇంటిపై డ్రోన్ ఎగరడం హాట్ టాఫిక్ గా మారింది . డ్రోన్  ద్వారా  చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని చిత్రీకరించారని  టిడిపి నేతలు ఆరోపించారు .  మాజీ సీఎం ఇంటిని  డ్రోన్ ద్వారా ఎలా చిత్రీకరిస్తారని వారు ప్రశ్నించారు .  బాబు ఇంటిని డ్రోన్ ద్వారా  చిత్రీకరణకు ప్రయత్నించిన వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  ఇదే విషయమై చంద్రబాబు డీజీపీ తో పాటు గుంటూరు ఎస్పీ తో మాట్లాడినట్టు తెలుస్తోంది . హై  సెక్యూరిటీ జోన్ లో  డ్రోన్ ఎలా వినియోగించారని, ప్రభుత్వం , పోలీసుల అనుమతి ఉందా? అని అయన  ప్రశ్నించగా అధికారులు పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం . దీనితో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: