Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:48 pm IST

Menu &Sections

Search

అద్భుతం! ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక..!

అద్భుతం! ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక..!
అద్భుతం! ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమరావతి, శాసనమండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్ దాఖలుచేసిన వైకాపా అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యినట్లు సమాచారం. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి పి.బాలకృష్ణమాచారి నుంచి సోమవారం ధ్రువీకరణ పత్రాలు అధికారికంగా అందుకున్నట్లు తెలుస్తుంది. జగన్ మళ్ళీ మళ్ళీ తన సత్తా చాటుకుంటున్నాడు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా ఆయన అడుగులు సాగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అయన ప్రతి చర్య ఒక మని తునక.

 

ఇక మూడవ  అభ్యర్థిగా ఎన్నికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ వరద సహాయక చర్యల పర్యవేక్షణలో ఉన్నందువల్ల రాలేకపోయారని, ఆయన సహాయకులు రిటర్నింగ్ అధికారికి తెలిపారు. ఈ 3 స్థానాలకూ తెదేపా నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో.. వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.

 

తన రాజకీయ సువిశాల జీవితంలో రెండు అద్భుతాలు చూశానని చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. 2008-౦౯ లో వైఎస్ హయాంలో కృష్ణా, గోదావరి పొంగి జలాశయాలు నిండినపుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కాగానే మళ్లీ కృష్ణా, గోదావరి పొంగి జలాశయాలు నిండుతున్న తరుణంలో ఎమ్మెల్సీగా ఉన్నానని, దీనికి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

 

ఇంకొకటి రాజకీయ అద్భుతమని, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో టి.డి.పి ది దీనగాథ అయితే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైకాపాది వీరగాథ అయిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఇక్బాల్ చెప్పారు. ఇకనుండి మనసా, వాచా, కర్మణా తన కర్తవ్యమ్ చేసేందుకు శతవిధాలా తనవంతు ప్రయత్నిస్తానని ఉద్గాటించారు.


mlc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సేఫ్ గేమ్
రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ సపోర్ట్
ఈరోజే దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్
అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న భారత్
ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్
బిగ్ బాస్ - 3 లో ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా?
సినిమా తాజా వార్తలు ....
తన "యాక్షన్" తో వస్తున్న విశాల్
కలెక్షన్స్‌తో సత్తా చాటుతున్న ‘సాహో’
పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాక్ ప్రధాని "ఇమ్రాన్ ఖాన్"
పుణెరి పల్టాన్ చేతిలో పోరాడి ఓడిన గుజరాత్‌
నేడే ధర్మశాలలో భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్
పవన్‌పై సెటైర్లతో విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి
నెమ్మదిగా నాని ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.