జులై 22 వ తేదీన ఇండియా చరిత్రలో చెరగని ముద్రని వేసుకున్న రోజు.  ఆరోజున ఇస్రో చంద్రయాన్ 2 ను రోదసీలోకి పంపింది.  అనుకున్నట్టుగా ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు పండుగ చేసుకున్నారు. నేటికీ సరిగ్గా 29 రోజులైంది ఆ ప్రయోగం జరిగి.  ఈరోజు చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి చేరుకోబోతున్నది.  చంద్రయాన్ కక్ష్యలోకి చేరుకున్నాక ఉపగ్రహం వేగాన్ని తగ్గిస్తారు.  తగ్గించి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతారు.  దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  


చంద్రుడు చుట్టూ 65వేల కిలోమీటర్ల మేరలో ఉన్న వస్తువులను తనవైపుకు ఆకర్షించే శక్తిని ఉంటుంది.  ఆ చంద్రుని కక్ష్యలోకి చేరుకున్నాక అసలు ఘట్టం మొదలౌతుంది.  అక్కడి నుంచి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి.  చంద్రయాన్‌-2 వేగాన్ని తగ్గించి దశ, దిశ మార్చడంతో చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత సెప్టెంబరు రెండో తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు. ఫలితంగా ల్యాండర్‌ మృదువుగా ల్యాండింగ్‌ కానుంది. సెప్టెంబరు 7వ తేదీ వేకువజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో సాఫీగా ల్యాండింగ్‌ చేయనుంది.



చంద్రునిపై రోవర్ దిగిన తరువాత అక్కడి నేలపై ప్రయోగాలు చేయబోతున్నది.  సెకనుకు సెంటీమీటర్ చొప్పున రోవర్ ప్రయాణం చేస్తుంది.  అక్కడ సేకరించిన వివరాలను భూమి మీదకు పంపుతుంది.  దానైని ఆధారం చేసుకొని పరిశోధనలు చేస్తారు.  ఇప్పటికే అక్కడ నీరు ఘనరూపంలో ఉందని ఇండియా కనుగొన్న సంగతి తెల్సిందే.  ఇప్పటి వరకు చంద్రుని రేఖమధ్యభాగంలో మాత్రమే పరిశోధనలు జరిగాయి.  



కానీ, మొదటిసారి ఇండియా చంద్రుని ధ్రువప్రాంతాలపై దృష్టి సారించి పరిశోధనలు చేసింది.  నీటి ఉనికిని కనుగొన్నది.  ఘనరూపంలో ఉన్న ఆ నీటిని తిరిగి ఎలా వినియోగించుకోవాలి అన్నది ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న ప్రశ్న.  ఒకవేళ ఈ నీటిని వినియోగానికి అనుగుణంగా మార్చుకుంటే .. భూమికి ప్రత్యామ్నాయంగా చంద్రునిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.  ఆవాసయోగ్యంగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: